INDW vs ENGW : ఇంగ్లండ్ పర్యటనలో భారత మహిళల జట్టు తొలి పరీక్షకు సిద్ధమైంది. ఐదు టీ20ల సిరీస్‌లో ఆతిథ్య జట్టుతో టీమిండియా మొదటి మ్యాచ్ ఆడుతోంది. నాటింగ్హమ్లోని ట్రెంట్‌బ్రిడ్జ్‌లో జరుగుతున్న ఈ పోరులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ నాట్‌సీవర్ బ్రంట్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌తో భారత డాషింగ్ ఓపెనర్ షఫాలీ వర్మ (Shafali Verma) పునరాగమనం చేయనుంది.
అయితే.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ లేకుండానే టీమిండియా ఈ మ్యాచ్ ఆడనుంది. ఎందుకంటే.. టీ20 వామప్ మ్యాచ్‌లో తలకు గాయం కావడంతో ఆమెకు విశ్రాంతి ఇచ్చారు. దాంతో, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన జట్టును నడిపించనుంది. విజయంతో సిరీస్‌ను ఆరంభించాలనుకుంటున్న టీమిండియా ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగుతోంది.
Captains ready 👊
Follow every ball live in our match centre 👇
— England Cricket (@englandcricket) June 28, 2025
భారత తుది జట్టు : స్మృతి మంధాన(కెప్టెన్), షఫాలీ వర్మ, హర్లీన్ డియోల్, జెమీమా రోడ్రిగ్స్, రీచా ఘోష్(వికెట్ కీపర్), దీప్తి శర్మ, అమన్‌జోత్ కౌర్, స్నేహ్ రానా, రాధా యాదవ్, అరుంధతి రెడ్డి, శ్రీ చరణి.
ఇంగ్లండ్ తుది జట్టు : సోఫీ డంక్లే, డానియెల్లే వ్యాట్ హొడ్గే, నాట్ సీవర్ బ్రంట్(కెప్టెన్), టమ్మీ బ్యూమంట్, అమీ జోన్స్(వికెట్ కీపర్), అలీ క్యాప్సే, సోఫీ ఎకిల్‌స్టోన్, ఎమ్ అర్లాట్, లారెన్ ఫిలెర్, లిన్సే స్మిత్, లారెన్ బెల్.