మన శరీరంలో ఫ్యాటీ లివర్ ఒక మహమ్మారిలా విస్తరిస్తున్నది. ఒకప్పుడు కేవలం మద్యం తాగే వారిలోనే కాలేయ సమస్యలు కనిపిస్తాయని అనుకునేవారు. కానీ, మారుతున్న జీవనశైలి కారణంగా ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మద్యం అలవాటు లేకపోయినా ఊబకాయం, మధుమేహం వంటి సమస్యల వల్ల కాలేయం చుట్టూ కొవ్వు పేరుకుపోతుందన్నమాట.
సమయానికి గుర్తించకపోతే ఇది లివర్ ఫైబ్రోసిస్, లివర్ క్యాన్సర్ లాంటి ప్రాణాంతక సమస్యలకు దారితీస్తుంది. అయితే, మనం తీసుకునే ఆహారంలో చిన్నపాటి మార్పులు చేసుకుంటే చాలు ఈ ముప్పు నుంచి బయటపడొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.అందులో భాగంగా కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఐదు అద్భుతమైన ఆహారాల గురించి తెలుసుకుందాం.
బ్లాక్ కాఫీ: చాలామంది ఉదయాన్నే కాఫీతో రోజును ప్రారంభిస్తారు. అయితే పాలు, చకెర లేని బ్లాక్ కాఫీ కాలేయానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులోని కెఫీన్ కాలేయ వ్యాధులు తీవ్రతరం కాకుండా అడ్డుకోవడమే కాకుండా ఫ్యాటీ లివర్ సమస్యను తగ్గించడంలో చురుకైన పాత్ర పోషిస్తుంది.
బ్లూ బెర్రీస్: సూపర్ ఫుడ్స్ జాబితాలో బ్లూబెర్రీస్కి ప్రత్యేక స్థానం ఉంది. వీటిలో ఉండే ఆంథోసైనిన్స్ సమ్మేళనాలు కాలేయ కణాలలో వాపును తగ్గిస్తాయి. ఇవి కాలేయ కణాలకు రక్షణ కవచంలా పనిచేసి కొవ్వు పేరుకుపోకుండా చూస్తాయి.
ఉసిరి: మన సంప్రదాయ ఆయుర్వేదంలో ఉసిరికి ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. ఇందులో విటమిన్-సి పుషలంగా ఉంటుంది. ఇది శరీరంలోని ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గించి కాలేయం పనితీరును మెరుగుపరుస్తుంది. ప్రతిరోజూ ఉసిరిని ఏదో ఒక రూపంలో తీసుకోవడం వల్ల ఫ్యాటీ లివర్ నుంచి త్వరగా కోలుకోవచ్చు.
అవకాడో: ఇది మన దేశానికి చెందిన పండు కాకపోయినా ప్రస్తుతం మారెట్లో విరివిగా లభిస్తున్నది. ఇందులో ఉండే గ్లూటాథియోన్ అనే అద్భుత పోషకం కాలేయ కణాల పునరుత్పత్తికి సాయపడుతుంది. ఇది కాలేయంపై పడే ఒత్తిడిని తగ్గించి వ్యాధి ముదరకుండా అడ్డుకుంటుంది.
పసుపు – మిరియాల పొడి: మన వంటింట్లో ఉండే పసుపు గొప్ప ఔషధం. పసుపులో ఉండే కరుమిన్ వాపును తగ్గించే గుణాలను కలిగి ఉంటుంది. అయితే, పసుపును మన శరీరం పూర్తిగా గ్రహించాలంటే దానికి మిరియాల పొడి తోడవ్వాలి. ఈ రెండింటి కలయిక కాలేయంలో కొవ్వును కరిగించడానికి, వాపును తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తుంది.