సిద్ధు జొన్నలగడ్డకు గత రెండు చిత్రాలు అంతగా కలిసి రాలేదు. దీంతో ఆయన భారీ హిట్‌కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ’ ఫేమ్ ఆర్జేఎస్ స్వరూప్ దర్శకత్వంలో చేయబోతున్న చిత్రంపై ఎన్నో ఆశల్ని పెట్టుకున్నారు. అగ్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ‘రాంబో’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు తెలిసింది.
ఓ సాధారణ యువకుడు అనుకోని పరిస్థితుల్లో డిటెక్టివ్ ఏజెంట్‌గా మారితే ఏం జరిగిందన్నదే చిత్ర కథాంశమని, వినోదంతో పాటు సస్పెన్స్ ప్రధానంగా నడుస్తుందని సమాచారం. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థలో సిద్ధు జొన్నలగడ్డ ఇప్పటికే ‘డీజే టిల్లు’ ‘టిల్లు స్వేర్’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్స్‌ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన లక్కీ బ్యానర్లో మరో హిట్ పక్కా దక్కుతుందనే నమ్మకంతో ఉన్నారు సిద్ధు జొన్నలగడ్డ.