కేపీహెచ్బీ కాలనీ, జూన్ 28: భారత ఆర్థిక సంస్కరణలకు పితామహుడు పీవీ నరసింహారావు అని, రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, దేశానికి ప్రధానమంత్రిగా ఆయన అందించిన సేవలు మరువలేనివని ఎమ్మెల్సీ సురభి వాణిదేవి (Surabhi Vani Devi), కార్పొరేటర్ శ్రీనివాసరావు అన్నారు. శనివారం మాజీ ప్రధాని భారతరత్న పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా కేపీహెచ్బీ కాలనీ 6వ ఫేజ్ పీవీఎన్ఆర్ పార్కులో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పీవీ విగ్రహాన్ని ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, కేపీహెచ్బీ కాలనీ కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశ ప్రధానిగా ఆర్థిక సంవత్సరాలకు శ్రీకారం చుట్టి దేశాన్ని అభివృద్ధి చెందేలా కృషి చేసిన మహనీయుడని కొనియాడారు. బహుభాషా కోవిదుడు అయిన పీవీ నరసింహారావును స్ఫూర్తిగా తీసుకొని యువత ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో సన్యాసిరావు, శ్రీరామ్, ప్రసాద్, జగదీష్, అచ్యుతరామయ్య, సోమేష్, ఫణి, వెంకటరావు, పార్వతి, ఝాన్సీ, గాయత్రి, పలువురు అసోసియేషన్ సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు.