ECB : ఇంగ్లండ్ సీనియర్ పేసర్ క్రిస్ వోక్స్ (Chris Woakes) సమ్మర్ సీజన్లో ఆడేందుకు మార్గం సుగమమైంది. భారత ‘ఏ’ జట్టుతో జరుగబోయే మూడు నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌తో ఫామ్ అందుకోవాలని వోక్స్ అనుకుంటున్నాడు. గాయం కారణంగా జట్టుకు దూరమైన ఈ స్పీడ్‌స్టర్ ఈమధ్యే కోలుకున్నాడు. టీమిండియా సీనియర్ టీమ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌కు వోక్స్ సిద్దంగా ఉండాలని భావించిన ఈసీబీ.. అతడిని ఏ జట్టుతో ప్రాక్టీస్ మ్యాచ్‌లకు ఎంపిక చేసింది. ఇంగ్లండ్ లయన్స్ స్క్వాడ్‌లో బుధవారం ఇంగ్లండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ప్రకటించింది.
బలమైన భారత ఏ జట్టును ఎదుర్కొనేందుకు పటిష్టమైన స్క్వాడ్‌ను ఎంపిక చేసింది ఈసీబీ. జేమ్స్ రెవ్ కెప్టెన్‌గా 15 మందితో కూడిన స్క్వాడ్‌ను ప్రకటించింది. ఆస్ట్రేలియా ఏ జట్టుపై ఇంగ్లండ్ లయన్స్ తరఫున శతకంతో చెరేగిన రాకీ ఫ్లింటాఫ్ (Rocky Flintoff) కూడా చోటు దక్కింది. అంతర్జాతీయ క్రికెట్లో రాణిస్తున్న రెహ్మాన్ అహ్మద్ సైతం స్క్వాడ్‌లో ఉన్నాడు. మే 30 భారత ఏ జట్టుతో తొలి మ్యాచ్‌లో తలపడనుంది. భారత్‌కు అభిమన్యు ఈశ్వరన్ (Abhimanyu Easwaran) నేతృత్వం వహిస్తున్న విషయం తెలసిందే.
Wiz is back ❤️ @chriswoakes has been named in the England Lions squad to face India A 🏴 pic.twitter.com/KDJp9JsaV0
— England’s Barmy Army 🏴🎺 (@TheBarmyArmy) May 21, 2025
ఇంగ్లండ్ లయన్స్ స్క్వాడ్ : జేమ్స్ రేవ్(కెప్టెన్), ఫర్హాన్ అహ్మద్, రెహాన్ అహ్మద్, సోని బేకర్, జోర్డాన్ కాక్స్, రాకీ ఫ్లింటాఫ్, ఎమిలీయో గే, టామ్ హైన్స్, జార్జ్ హిల్, జోష్ హల్, ఎడీ జాక్, బెన్ మెక్కెన్నీ, డాన్ మౌస్లే, అజీత్ సింగ్ డాలే, క్రిస్ వోక్స్.
‘పటిష్టమైన భారత ఏ జట్టుతో సిరీస్ ఇంగ్లండ్ యువ క్రికెటర్లకు చక్కని అవకాశం. వ్యక్తిగతంగా, సమిష్టిగా రాణించేందుకు ఈ సిరీస్ ఎంతో ఉపయోగపడనుంది. అంతేకాదు అంతర్జాతీయ వేదికలపై రాణించేందుకు వీలు దొరుకుతుంది. భవిష్యత్‌లో ఇంగ్లండ్ సీనియర్ జట్టుకు ఎంపికయ్యే ఛాన్స్ కూడా రానుంది’ అని ఈసీబీ పర్ఫార్మెన్స్ డైరెక్టర్ ఈడీ బార్నే తెలిపాడు.