IPL 2025 : ప్లే ఆఫ్స్ బెర్తును నిర్ణయించే కీలక పోరులో ముంబై ఇండియన్స్ హిట్టర్ సూర్యకుమార్ యాదవ్ (73 నాటౌట్)సునామీలా విరుచుకుపడ్డాడు. వాంఖడే మైదానాన్ని బౌండరీలతో హోరెత్తించాడు. ఓపెనర్లు విఫలమైనా.. అర్ధ శతకంతో మెరిసిన ఈ హిట్టర్.. ఢిల్లీ బౌలర్ల లయను దెబ్బతీస్తూ ఫోర్లు, సిక్సర్లతో అలరించాడు. డెత్ ఓవర్లలో తనమార్క్ విధ్వసంక ఆటతో.. జట్టుకు పోరాడగలిగే స్కోర్ అందించాడు. నమన్ ధిర్(24 నాటౌట్) ముకేశ్ వేసిన 19వ ఓవర్లో 27 రన్స్ రాబట్టి స్కోర్ 150 దాటించాడు.ఇక చమీర బౌలింగ్‌లో సూర్య రెండు ఫోర్లు, సిక్సర్‌తో చెలరేగాడు. దాంతో, ముంబై 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది.
టాస్ ఓడిన ముంబై ఇన్నింగ్స్‌ను ఓపెనర్లు రోహిత్ శర్మ(5), రియాన్ రికెల్టన్(25)లు ధాటిగా మొదలెట్టారు. ముకేశ్ వేసిన తొలి ఓవర్ 5వ బంతిని రోహిత్ మిడాఫ్ దిశగా బౌండరీకి పంపాడు. ఆ తర్వాత చమీరకు చుక్కలు చూపిస్తూ వరుసగా 3, 4 బంతుల్ని స్టాండ్స్‌లోకి పంపాడు రికెల్టన్. దాంతో, ఆ ఓవర్లో 15 పరుగులు వచ్చాయి. అయితే.. 3వ ఓవర్ వేసిన ముస్తాఫిజుర్ డేంజరస్ హిట్‌మ్యాన్‌ను ఔట్ చేసి ఢిల్లీకి తొలి బ్రేకిచ్చాడు. రికెల్టన్ను ఔట్ చేసిన కుల్దీప్ యాదవ్ ఐపీఎల్లో 100వ వికెట్ సాధించాడు. వరసగా వికెట్లు పడిన ముంబైని సూర్యకుమార్ యాదవ్(73 నాటౌట్), తిలక్ వర్మ(27)లు ఆదుకున్నారు.
Another day, another Surya Kumar Yadav 5⃣0⃣🫡#MI‘s Mr. Consistent is on the charge! 👏
Updates ▶ https://t.co/fHZXoEJVed#TATAIPL | #MIvDC | @mipaltan | @surya_14kumar pic.twitter.com/L6kROrHgop
— IndianPremierLeague (@IPL) May 21, 2025
పిచ్ స్పిన్నర్లకు సహకరిస్తుండడంతో ఆచితూచి ఆడిన ఈ ద్వయం వికెట్ల పతనాన్ని అడ్డుకుంది. సింగిల్స్, డబుల్స్.. వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదిన ఈ జోడీ 10 ఓవర్లకు స్కోర్ 80 దాటించింది. అయితే.. 13వ ఓవర్ తర్వాత గేర్ మార్చిన సూర్య.. బౌండరీలతో చెలరేగాడు. నాలుగో వికెట్‌కు 55 పరుగులు జోడించిన తిలక్‌ను మకేశ్ పెవిలియన్ పంపి.. ముంబైని దెబ్బకొట్టాడు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా(3)ను ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. చమీర ఓవర్లో పెద్ద షాట్ ఆడబోగా.. లెగ్ సైడ్‌లో ముకేశ్ క్యాచ్ అందుకోగా 123 వద్ద ఐదు వికెట్లు కోల్పోయింది. దాంతో, జట్టకు పోరాడగలిగే స్కోర్ అందించే బాధ్యత తీసుకున్నాడు సూర్య. ముస్తాఫిజుర్ ఓవర్లో 4.. ముకేశ్ వేసిన 18వ తొలి బంతిని స్టాండ్స్‌లోకి పంపి అర్ధ శతకం సాధించాడీ మిస్టర్ 360. అదే ఓవర్లో నమన్ ధిర్(24 నాటౌట్)సైతం బ్యాట్ ఝులిపించి.. 4, 6, 6, 4తో 27 రన్స్ రాబట్టాడు. అనంతరం చమీర ఓవర్లో కళ్లు చెదిరేరీతిలో 4, 6 బాదిన అతడు.. కట్ షాట్‌తో బంతిని బౌండరీకి తరలించాడు. దాంతో, ముంబై నిర్ణీత ఓవర్లలో 180 పరుగులు చేసింది.