హైదరాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పీఎం రహత్ పథకంతో రోడ్డు ప్రమాదాలను తగ్గించవచ్చని, ఆ పథకంలో చేరడానికి తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా ఉన్నదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల్లో అమలవుతున్న వాహన సారథిలో కూడా ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం చేరిందని పేరొన్నారు.
పీఎం రహత్ పథకంపై అన్ని రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులు, ఆ శాఖ కార్యదర్శులు, డీజీపీలతో కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడరీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ ఈవీ పాలసీ ద్వారా 100 శాతం పన్ను మినహాయింపు చేసినట్టు కేంద్ర మంత్రి గడరీకి వివరించారు. తెలంగాణలో ఆటోమేటిక్ టెస్టింగ్ కేంద్రాలు, ఆటోమేటిక్ డ్రైవింగ్ స్టేషన్లు, లైసెన్సుల జారీలో విప్లవత్మక మార్పులు తీసుకొచ్చినట్టు తెలిపారు. తెలంగాణ నుంచి ఈ వీసీలో స్పెషల్ సీఎస్ వికాస్‌రాజ్, జేటీసీలు చంద్రశేఖర్‌గౌడ్, శివలింగయ్య తదితరులు పాల్గొన్నారు.