నార్త్ సౌండ్: టీ20 వరల్డ్‌కప్(T20 World Cup)లో గ్రూప్ బీలో భాగంగా జరిగిన మ్యాచ్‌లో ఒమన్‌పై 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ విజయం నమోదు చేసింది. ఇంగ్లండ్ బౌలర్ అదిల్ రషీద్ నాలుగు వికెట్లు తీయడంతో.. ఒమన్ కేవలం 47 పరుగులే చేసి ఆలౌట్ అయ్యింది. స్వల్ప టార్గెట్‌తో బరిలోకి దిగిన ఇంగ్లండ్ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని అందుకున్నది. ఇంగ్లండ్ బ్యాటర్ ఫిల్ సాల్ట్ తొలి రెండు బంతుల్ని సిక్సర్లుగా మలిచి ఆ తర్వాత మూడో బంతికే ఔటయ్యాడు. కేవలం 3.1 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి ఇంగ్లండ్ 50 రన్స్ చేసింది. బట్లర్ 8 బంతుల్లో 24 రన్స్ చేశాడు. గ్రూప్ బిలో మూడు పాయింట్లతో ప్రస్తుతం మూడవ స్థానంలో నిలిచింది ఇంగ్లండ్. ఒమన్‌తో మ్యాచ్‌కు ముందు మైనస్‌లో ఉన్న ఆ జట్టు రన్‌రేట్ ఇప్పుడు ప్లస్ 3.08కి పెరిగింది. ఆంటిగ్వాలోని వివియన్ రిచర్డ్స్ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ తన ప్లాన్‌ను సరిగ్గా వర్కౌట్ చేసింది.
England get it done in Antigua 🇦🇬#T20WorldCup | #ENGvOMA | 📝 https://t.co/BiuEErUUqL pic.twitter.com/sJC7T71XQp
— T20 World Cup (@T20WorldCup) June 13, 2024