UAE – PCB : పాకిస్థాన్‌కు వరుసగా షాక్‌లు తలుగుతున్నాయి. భారత సైన్యం నిర్వహించిన ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor)తో ఉగ్రస్థావరాలు నేలమట్టం కాగా.. 400లకు పైగా డ్రోన్లు తునాతునకలయ్యాయి. ఈ పరిస్థితుల్లో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(PCB)కు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE) ప్రభుత్వం ఊహించని ఝలక్ ఇచ్చింది. పాకిస్థాన్ సూపర్ లీగ్(PSL 2025) మ్యాచ్‌లను తమ దేశంలో నిర్వహించేందుకు ఆసక్తి చూపిండం లేదు.
భారత్‌తో ఉద్రిక్తతల నడుమ తాము పాక్ బోర్డు విన్నపాన్ని తోసిపుచ్చేందుకు ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు (ECB) సిద్దమైంది. దాంతో, ఏమి చేయాలో పాలుపోక పీసీబీ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. పహల్గామ్లో ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం(Indian Army) చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’తో పాక్ ఉలిక్కి పడింది. అత్యాధునిక ఆయుధాలతో ఇండియన్ సైన్యం చేస్తున్న దాడులకు జడిసిన దాయాది దేశం.. పీఎస్ఎల్ను యూఏఈకి తలరించాలని అనుకుంది. ఇదే విషయమైన ఎమిరేట్స్ క్రికెటర్ల యూఐఈ వేదికగా తరలించాలని భావించింది.
BIG BREAKING:
UAE declines to host the Pakistan Super League (PSL), rejecting what critics are calling Pakistan’s “flop show.”#karachiport #iplsuspended #IndianNavy #Pakistan #IndoPakWar #PSL2025 pic.twitter.com/NC5b6fv1vf
— 𝑨𝒏𝒖𝒓𝒂𝒏 🚩 (@anurandey_7) May 9, 2025
కానీ, ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు మాత్రం అందుకు ససేమిరా అంటోంది. ఇరుదేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న ఈ సమయంలో తాము పీఎస్ఎల్కు ఆతిథ్యం ఇవ్వడం సరికాదని యూఏఈ ప్రభుత్వం భావిస్తోంది. ఒకవేళ పీసీబీ ప్రతిపాదనకు అంగీకరిస్తే.. కొన్నాళ్లుగా భారత క్రికెట్ నియంత్రణ మండలితో తమకున్న సఖ్యత ఎక్కడ దెబ్బతింటుందేమోనని అరబ్ దేశం ఆలోచిస్తోంది.
‘గత కొంత కాలంగా ఎమిరేట్స్ క్రికెట్ బోర్డుకు బీసీసీఐతో సత్సంబంధాలు ఉన్నాయి. 2021లో టీ20 వరల్డ్ కప్‌తో పాటు ఐపీఎల్ మ్యాచ్‌లు ఇక్కడ జరిగాయి. ఈమధ్యే ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఇక్కడే ఆడింది. అందుకే.. మాకు బీసీసీఐతో స్నేహం చెడడం ఇష్టం లేద’ని ఎమిరేట్స్ బోర్డు ప్రతినిధులు అంటున్నారు. పైగా.. ఐసీసీ(ICC) ప్రధాన కార్యాలయం దుబాయ్‌లో ఉంది. బీసీసీఐకి సెక్రటరీగా సేవలందించిన జై షా (Jai Shah) ప్రస్తుతం ఐసీసీ ఛైర్మన్‌గా ఉన్నాడు. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న ఆ దేశ బోర్డు.. పీఎస్ఎల్ మ్యాచ్‌లకు నో చెబుతోంది.