IPL 2025 : ‘దేశం కంటే ఏదీ ముఖ్యం కాదు’ అంటూ ఐపీఎల్ 18వ సీజన్‌ను బీసీసీఐ(BCCI) వాయిదా వేసింది. ఐపీఎల్ పాలక మండలితో పాటు బీసీసీఐ సంయుక్తంగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఫ్రాంచైజీలు స్వాగతిస్తున్నాయి. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్న ఈ సమయంలో భారత సైన్యం వెన్నంటే ఉంటామని క్రికెటర్లు పోస్ట్‌లు పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) సహ పలు ఫ్రాంచైజీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి.
వారం రోజుల పాటు వాయిదా పడడంతో అభిమానులకు మ్యాచ్ టికెట్ డబ్బులను వాపస్ ఇస్తామని ‘ఎక్స్’ వేదికగా వెల్లడించాయి. ఐపీఎల్ వాయిదాతో టికెట్లు కొన్న అభిమానులు ఇక తమ డబ్బులు పోయినట్టేనా? అని ఆందోళన చెందుతున్నారు. అయితే.. ఎవరూ కంగారు పడాల్సిందేమీ లేదని.. టికెట్ పైసల్ తిరిగి ఇచ్చేస్తామని సన్‌రైజర్స్ శుక్రవారం ఎక్స్ వేదికగా వెల్లడించింది.
𝐔𝐏𝐃𝐀𝐓𝐄:
In light of the current situation, #TATAIPL2025 has been suspended with immediate effect. Ticket refund details will be communicated shortly. pic.twitter.com/Gw2Qs3FZG0
— SunRisers Hyderabad (@SunRisers) May 9, 2025
‘దేశ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఐపీఎల్‌ను ఉన్నపళంగా రద్దయ్యింది. వారం రోజుల పాటు మ్యాచ్‌లకు బ్రేక్ ఇస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. మే 10వ తేదీన ఉప్పల్ స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders)తో జరగాల్సిన మ్యాచ్ టికెట్లు కొన్నవాళ్లకు డబ్బులు రీఫండ్ చేస్తాం’ అని ఆరెంజ్ ఆర్మీ తన పోస్ట్‌లో రాసుకొచ్చింది. ఫ్యాన్స్‌కు తిరిగి చెల్లించనున్న డబ్బుల వివరాలను త్వరలోనే కావ్యా మారన్ (Kavya Maran) బృందం వెల్లడించనుంది. లక్నోలోని ఏక్నా స్టేడియం నిర్వాహకులు సైతం కూడా మ్యాచ్ టికెట్ పైసల్ని ఫ్యాన్స్‌కు తిరిగి ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.
ఐపీఎల్ ప్లే ఆఫ్స్ బెర్తలు నిర్ణయించే కీలక మ్యాచ్‌ల టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. అయితే.. పాకిస్థాన్‌తో ఉద్రిక్తతల నడుమ ఆటగాళ్ల భద్రతను దృష్టిలో ఉంచుకొని లీగ్‌ను వారం రోజులు వాయిదా వేసింది బీసీసీఐ. దాంతో,ఈ వారం షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన మ్యాచ్‌లకు బ్రేక్ పడింది. మే 9న లక్నో వేదికగా ఆర్సీబీతో పంత్ సేన తలపడాల్సింది. కానీ, మ్యాచ్ రద్దుతో మ్యాచ్ టికెట్లను చెల్లించేందుకు లక్నో ఫ్రాంచైజీ అంగీకరించింది.
TATA IPL 2025 suspended for one week.
More details here 👇👇 | #TATAIPL
— IndianPremierLeague (@IPL) May 9, 2025
సన్‌రైజర్స్, లక్నో తరహాలోనే ఇతర ఫ్రాంచైజీలు కూడా వాయిదా పడిన మ్యాచ్ టికెట్ల డబ్బలను రీఫండ్ చేయనున్నాయి. 18వ సీజన్లో 57 మ్యాచ్‌లు పూర్తిగా సాగాయి. 58వ మ్యాచ్ అర్ధాంతరంగా రద్దు కాగా.. ఫైనల్‌తో కలిపి ఇంకా 16 మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. సాధారణ పరిస్థితులు నెలకొన్నాక వీటికి కొత్త షెడ్యూల్ ప్రకటించే అవకాశముంది.