Drugs | చిగురుమామిడి, మే 9: డ్రగ్స్ నిర్మూలన పోరు యాత్రలో భాగంగా చిగురుమామిడి మండల కేంద్రంలో జేఏసీ మరియు మహిళా సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం ముగింపు సభ నిర్వహించారు. చిగురుమామిడి బస్టాండ్ నుండి సమావేశ మందిరం వరకు మహిళలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి, జేఏసీ చైర్మన్ కవ్వ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ గ్రామాలలో డ్రగ్స్ వల్ల జరిగే అనర్ధాలు, భవిష్యత్తులో పడే ఇబ్బందులు, యువత చెడు మార్గంలో అవలంబిస్తున్న విధానాలను వివరించారు.
డ్రగ్స్ వల్ల సామాజికంగా ఆర్థికంగా, ఆరోగ్యపరంగా యువతను నష్టపోతున్నారన్నారు. నియోజవర్గంలో డ్రగ్స్ నిర్మూలన పోరు యాత్రకు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారని తెలిపారు. మండలంలో డ్రగ్స్ నిర్మూలన పోరు యాత్రకు విశేష స్పందన లభించిందన్నారు. ఇదే స్పూర్తితో మహిళలు ముందుకు వెళ్లాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడమ్ లింగమూర్తి, మాజీ ఎంపీపీ కొత్త వీనీత, మాజీ జెడ్పీటీసీ గీకురు రవీందర్, ఏపీఎం మట్టెల సంపత్, నియోజకవర్గం కో ఆర్డినేటర్ డ్యాగల సారయ్య, తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేప్యాల ప్రకాష్, లోడీ సంస్థ ప్రతినిధులు ఉప్పుల కుమారస్వామి, గాండ్ల పద్మ, జేఏసీ బాధ్యులు వేముల జగదీష్, తాళ్లపల్లి జగన్, తాళ్లపల్లి ప్రభాకర్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మామిడి అంజయ్య, సీపీఐ మండల కార్యదర్శి నాగెల్లి లక్ష్మారెడ్డి, వంగర మల్లేశం, ఎస్సై జగదీశ్వర్, సీసీలు గంప సంపత్, వెంకటేశ్వర్లు, సత్యనారాయణ, వెంకటమల్లు, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు గంధే రజిత, కొల హరిణి, వీవోఏలు, సీఏలు తదితరులు పాల్గొన్నారు.