Roja- Manchu Lakshmi | ప్రస్తుతం జీ తెలుగులో సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్ సక్సెస్ ఫుల్‌గా సాగుతుంది. తాజాగా ఫైనల్ ఎపిసోడ్ జరగగా, ఈ కార్యక్రమానికి మంచు లక్ష్మీ, రోజా గెస్ట్లుగా హాజరయ్యారు. అంతేకాదు చిందులేసి గత్తరలేపారు. యాంకర్ రవి ఓ స్పెషల్ వీడియోని షేర్ చేయగా, అందులో వారి డ్యాన్స్ చూసి నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేశాడు. ఈ కార్యక్రమానికి యాంకర్ రవి హోస్ట్ గా ఉన్నాడు .మంచు లక్ష్మి, రోజా గెస్ట్లుగా హాజరై మాస్ డ్యాన్సులు చేసారు. వారి డ్యాన్స్‌కి సంబంధించిన వీడియోని రవి తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు.
తొలుత యాంకర్ రవి, మంచు లక్ష్మి కలిసి మాస్ డ్యాన్స్ చేయగా, ఆ తర్వాత రవి, రోజా కలిసి డ్యాన్స్ వేశారు. అనంతరం రవి, మంచు లక్ష్మి, రోజా ముగ్గురూ కలిసి డ్యాన్స్ వేశారు. ప్రస్తుతం ఈ డ్యాన్స్ నెట్టింట వైరల్‌గా మారింది. మంచు లక్ష్మీ, రోజాలు ఈ రేంజ్లో మాస్ డ్యాన్స్ వేస్తారా అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. రవి వీడియోని కొంచెం ఫాస్ట్ మోడ్ లో పెట్టడంతో వారు మరింత మాస్ గా డ్యాన్స్ వేసినట్టు అనిపిస్తుంది. ప్రస్తుతానికి ప్రోమో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. ఇక వీరిద్దరు షోలో మాములు రచ్చ చేసి ఉండరని కొందరు కామెంట్ చేస్తున్నారు.ఈ ఆదివారం (మే 11) రాత్రి 9 గంటలకి ఫినాలే ఎపిసోడ్ టెలికాస్ట్ కాబోతుంది.
వైసీపీలో ఉన్నప్పుడు మంత్రిగా ఉన్న రోజా షోస్‌కి దూరంగా ఉంది. ఎప్పుడైతే వైసీపీ దారుణంగా ఓడిందో ఇక రోజా మళ్లీ బుల్లితెరవైపు అడుగులు వేసింది. డ్రామా జూనియర్స్ షోలో జడ్డీగా కొనసాగుతున్నారు. ఇందులో అనిల్ రావిపూడి మరో జడ్డీగా ఉన్నారు. ఈ షోని సుడిగాలి సుధీర్ హోస్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్ ఫినాలేకి గెస్టుగా వచ్చారు. యాంకర్ రవి-అషూరెడ్డి ఈ షోని హోస్ట్ చేస్తుండగా, ఇందులో మొత్తం 16 జంటలు టైటిల్ కోసం పోటీ పడ్డాయి. మరి చివరిగా టైటిల్ గెలిచేది ఏ సీరియల్ టీమ్ అనేది చూడాలి.