గట్టుప్పల్, మే 09 : గట్టుప్పల్ మండల కేంద్రానికి చెందిన నిరుపేద చేనేత కార్మికులు చిలుకూరు అంజయ్య, సత్తయ్యకు ఉండడానికి ఇల్లు లేక బస్టాండ్, వివిధ ప్రధాన కూడలిలో జీవనం కొనసాగిస్తున్నారు. గమనించిన పద్మశాలి సంఘం నాయకులు వారికి ఉండడానికి ఇల్లు నిర్మించాలని నిశ్చయించుకుని సంఘం ఆధ్వర్యంలో డబ్బులు జమ చేసి ఓ గది నిర్మించారు. శుక్రవారం తాజా మాజీ జడ్పీటీసీ కర్నాటి వెంకటేశం చేతుల మీదుగా నూతన ఇంటిని ప్రారంభించారు.
ఈ సందర్భంగా కర్నాటి వెంకటేశం మాట్లాడుతూ.. నిరుపేద కుటుంబానికి పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఇంటి నిర్మాణం చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు నామని జగన్నాథం, మాజీ జడ్పీటీసీ నామని గోపాల్, పద్మశాలి యువజన సంఘం అధ్యక్షుడు పున్న కిశోర్, సంఘం నాయకులు పున్న ఆనంద్, నామని బుచ్చయ్య, కర్నాటి వెంకటేశం, తిరందాస్ ఆనంద్, చెరుపెల్లి సత్తయ్య, చిలుకూరి అంజయ్య, కర్నాటి లింగయ్య, సాంబయ్య, జగన్, కోటయ్య, సూరయ్య పాల్గొన్నారు.
Gattuppal : నిరుపేద కుటుంబానికి అండగా పద్మశాలి సంఘం