Shamshabad Airport | హైదరాబాద్ : హైదరాబాద్‌కు సమీపంలోని శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు ఈ-మెయిల్ వచ్చింది. శుక్రవారం ఈ మెయిల్ రావడంతో.. ఎయిర్‌పోర్టు అధికారులు, సీఐఎస్ఎఫ్ బలగాలు, స్థానిక పోలీసులు, బాంబు స్క్వాడ్ కలిసి ఎయిర్‌పోర్టుతో పాటు పరిసర ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. విస్తృత తనిఖీల అనంతరం ఎలాంటి బాంబులు లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు. దీంతో ఎయిర్‌పోర్టు సిబ్బంది, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
ఎయిర్‌పోర్టు అడ్మినిస్ట్రేటివ్ వింగ్‌కు చెందిన అఫిషియల్ ఈమెయిల్‌కు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బాంబులు పెట్టామని, ఏ క్షణమైనా పేల్చేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. ఇక మెయిల్లో టెర్రర్ స్లీపర్ సెల్‌గా సదరు వ్యక్తి పేర్కొన్నాడు.
విస్తృత తనిఖీల అనంతరం బాంబులు ఎయిర్‌పోర్టులో లేవని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మొత్తానికి శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. సీఐఎస్ఎఫ్ బలగాల పర్యవేక్షణలో శంషాబాద్ ఎయిర్‌పోర్టు వద్ద నిఘా పెంచారు. డేగ కళ్లతో సీఐఎస్ఎఫ్ బలగాలు విమానాశ్రయానికి భద్రత కల్పిస్తున్నాయి. శాంతి భద్రతల విభాగం, ఇంటెలిజెన్స్, ఎస్బీ పోలీసుల సమన్వయంతో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ఎయిర్‌పోర్టు చుట్టూ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా భద్రతను పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు.