IPL 2025 : ఐపీఎల్ అభిమానులకు గుడ్ న్యూస్. మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni) మళ్లీ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ చేపట్టనున్నాడు. అది కూడా సొంతమైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals)తో జరిగే మ్యాచ్‌లో మహీ భాయ్ సారథిగా వ్యవహరించనున్నాడు. కారణం ఏంటంటే.. . ప్రస్తుతం కెప్టెన్‌గా ఉన్న రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) గాయపడ్డాడు. రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్ సమయంలో ఎడమ మోచేతికి
గాయంతో బాధ పడిన రుతురాజ్.. ఢిల్లీతో మ్యాచ్‌కు అందుబాటులో ఉండకపోవచ్చు.
అందుకే.. మాజీ నాయకుడు అయిన ధోనీకే మళ్లీ పగ్గాలు అప్పగించాలని యాజమాన్యం భావిస్తోంది. శనివారం చెపాక్ స్టేడియంలో చెన్నై జట్టు ఢిల్లీతో తలపడనుంది. అదే జరిగితే.. మరోసారి కెప్టెన్ కూల్ తాలా తనదైన వ్యూహాలతో సీఎస్కేను విజయాల బాట పట్టించడం ఖాయం. ప్రస్తుతం ఒకే ఒక విజయంతో.. పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉన్న చెన్నైకి ధోనీ సారథ్యం వహించడం శుభసూచకం అంటున్నారు విశ్లేషకులు.
MS Dhoni is likely to captain CSK against Delhi Capitals on Saturday if Ruturaj Gaikwad doesn’t recover from an elbow injury in time pic.twitter.com/sDMGglGbcW
— ESPNcricinfo (@ESPNcricinfo) April 4, 2025
చెన్నై సూపర్ కింగ్స్‌కు 5 ఐపీఎల్ ట్రోఫీలు అందించిన ధోనీ.. నిరుడు స్వచ్ఛందంగా సారథ్య బాధ్యతల నుంచి వైదొలిగాడు. తన వారసుడిగా ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌ను ఎంపిక చేసిన మహీ.. అతడిని తన అంతటి కెప్టెన్ చేసే పనిలో నిమగ్నమయ్యాడు. 42 ఏళ్లున్న ధోనీకి బహుశా ఇదే ఆఖరి సీజన్ కావచ్చు. దాంతో, ఈ ఎడిషన్‌ను విజయంతో ముగించాలనే పట్టుదలతో ఉంది సీఎస్కే టీమ్. ఈ నేపథ్యంలో మళ్లీ ధోనీకి కెప్టెన్సీ అప్పగించడం ఆ జట్టు అభిమానులను సంతోషంలో ముంచెత్తనుంది.