ఖిల్లా వరంగల్ : వరంగల్ జిల్లాలో ది ఫర్టిలైజర్స్ (Fertilizers) , పెస్టిసైడ్స్(Pesticides) అండ్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా నాగూర్లు వెంకటేశ్వర్లు ( President Venkateshwarlu ) , ప్రధానకార్యదర్శిగా గౌరిశెట్టి నాగరాజు ( Secretary Nagaraju ) కోశాధికారిగా నరసింహరెడ్డి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల అథారిటీ చైర్మన్ సత్యనారాయణరెడ్డి, ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ సందర్భంగా నూతన కమిటీ బాధ్యులను గజమాలతో ఘనంగా సన్మానించారు. అధ్యక్షుడు నాగూర్ల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ డీలర్లు, కార్యవర్గం సహాయ సహకారాలతో అసోసియేషన్ భవనంలోని అన్ని పనులు పూర్తి చేస్తామని అన్నారు. భవిష్యత్లో కూడా డీలర్ల సహకారం కొనసాగాలని కోరారు. డీలర్ల శ్రేయస్సే ధ్యేయంగా పని చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ, వరంగల్ జిల్లాల నుంచి అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.