వరంగల్ చౌరస్తా : వరంగల్‌లో ఈ నెల 5 నుంచి 28వ తేదీ వరకు జరుగనున్న శ్రీదేవి, భూదేవి, నీశాదేవి సహిత గోవిందరాజస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల (Brahmotsavams) పోస్టర్‌ను స్థానిక డివిజన్ కార్పోరేటర్ సీహెచ్ అనిల్‌కుమార్, ఆలయ కమిటీ ప్రతినిధులు ఆవిష్కరించారు. శుక్రవారం ఆలయ ఆవరణలో ఆలయ కార్యనిర్వహణాధికారి మిట్టపల్లి భాస్కర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కార్యక్రమం జరిగింది.
బ్రహ్మోత్సవాలలో భాగంగా తొలిరోజు ఎదురుకోలు ఉత్సవం, ( Edurukolu) , 8న మధ్నాహ్నం 12గంటలకు తిరుకళ్యాణోత్సవం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. 12న ఎడ్ల బండ్లతో శోభాయాత్ర , 13న పెద్ద రథోత్సవం , 18న దీపోత్సవం, పుష్పయాగం లాంటి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు.
బ్రహ్మోత్సవాల సందర్భంగా పార్కింగ్ నిర్వహణకు, కొబ్బరికాయలు, ప్రసాదాలు అమ్మకాలకు టెండర్లు నిర్వహించగా ఔత్సాహికుల నుంచి సరైన స్పందన రాకపోవడంతో వాయిదా వేసినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి మిట్టపల్లి భాస్కర్ అన్నారు.