ECB : లార్డ్స్ మైదానంలో థ్రిల్లింగ్ విక్టరీతో ఇంగ్లండ్ ఫుల్‌జోష్‌లో ఉంది. భారత జట్టుపై (22 పరుగులు) స్వల్ప తేడాతోనే గెలిచినప్పటికీ అండర్సన్ – టెండూల్కర్ ట్రోఫీలో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది బెన్ స్టోక్స్ (Ben Stokes) సేన. ఇదే ఉత్సాహంతో నాలుగో టెస్టులోనూ జయభేరి మోగించాలని ఆతిథ్య జట్టు భావిస్తోంది. అందుకే.. మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రఫోర్డ్‌లో జరుగబోయే మ్యాచ్‌కోసం స్పిన్ అస్త్రాన్ని స్క్వాడ్‌లో చేర్చుకుంది ఇంగ్లండ్. ఎడమచేతి వేలికి గాయం కారణంగా షోయబ్ బషీర్ సిరీస్ నుంచి నిష్క్రమించడంతో.. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ లియాం డాసన్ (Liam Dawson)ను నాలుగో టెస్టుకు ఎంపిక చేశారు సెలెక్టర్లు.
‘లార్డ్స్ టెస్టులో కేఎల్ రాహుల్ క్యాచ్ అందుకోబోయి గాయపడిన బషీర్ చివరి రెండు టెస్టులకు దూరమయ్యాడు. మ్యాచ్ విన్నర్ అయిన అతడి స్థానాన్ని భర్తీ చేయడానికి నిఖార్సైన స్పిన్నర్ అవసరం ఏర్పడింది. అందుకే లియాం డాసన్‌ను ఎంపిక చేశాం. ఈమధ్య కాలంలో ఈ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కౌంటీల్లో హ్యాంప్‌షైర్ జట్టు తరఫున అద్భుతంగా రాణిస్తున్నాడు.
Welcome, Daws! 👋
Spinner Liam Dawson joins our squad for the Fourth Test match against India 🏏
Full story 👇
— England Cricket (@englandcricket) July 15, 2025
రెండు పర్యాయాలు (2023, 2024కు గానూ)పీసీఏ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్నాడు. సో. ప్రస్తుత ఫామ్ దృష్ట్యా వైట్ జెర్సీ వేసుకునేందుకు అతడు చోటుకు అన్నివిధాలా అర్హుడు. ఎనిమిదేళ్ల తర్వాత డాసన్ టెస్టు స్క్వాడ్‌లో చోటు దక్కించుకోవడం విశేషం’ అని జాతీయ సెలెక్టరల్ ల్యూక్ రైట్ (Luke Wright) అన్నాడు. డాసన్ చివరిసారిగా 2017లో దక్షిణాఫ్రికాపై టెస్టు మ్యాచ్ ఆడాడు. అయితే.. పేసర్లు జేమీ ఓవర్టన్, సామ్ కుక్‌లను కౌంటీ ఛాంపియన్షిప్ కోసం విడుదల చేశామని ఈసీబీ ఒక ప్రకటనలో తెలిపింది. భారత్, ఇంగ్లండ్‌ల మధ్య జూలై 23న ఓల్డ్ ట్రఫోర్డ్‌లో నాలుగో టెస్టు జరుగనుంది.
ఇంగ్లండ్ స్క్వాడ్ : జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, బెన్ స్టోక్స్ (కెప్టెన్),జాకబ్ బెథెల్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్సే, లియాం డాసన్, జేమీ స్మిత్(వికెట్ కీపర్), జోష్ టంగ్, క్రిస్ వోక్స్, జోఫ్రా ఆర్చర్, గస్ అస్కిన్సన్.
Liam Dawson has received a Test recall after eight years, replacing the injured Shoaib Bashir in the squad.
Dawson was named the PCA Player of the Year in both 2023 and 2024.#ENGvIND #Cricket pic.twitter.com/rvty1IOP9F
— Wisden (@WisdenCricket) July 15, 2025