అనంతగిరి, జూలై 15 : అనంతగిరి మండల కేంద్రంలోని అనురాగ్ ఇంజినీరింగ్ కళాశాలలో ఈసీఈ తృతీయ సంవత్సరం విద్యార్థులకు ఐటిసి, సోహం అకాడమీ హైదరాబాద్ ఆధ్వర్యంలో రోబోటిక్స్ అంశంపై మంగళవారం వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా అకాడమీ ఎండీ సహదేవ్, ట్రైనర్స్ సంతోశ్, అజయ్ విద్యార్థులకు రోబోటిక్స్ తయారీ గురించి సోదాహరంగా వివరించారు. భవిష్యత్‌లో రోబోల వినియోగం పెరుగుతుందన్నారు.
కళాశాల ప్రిన్సిపాల్ సురేశ్‌కుమార్ మాట్లాడుతూ.. కళాశాలలో నిర్వహించే వర్క్‌షాపులను వినియోగించుకొని విద్యార్థులు సృజనాత్మకంగా ఆలోచించి నూతన ఆవిష్కరణలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఈసీఐ విభాగాధిపతి డాక్టర్ వెంకట హరిప్రసాద్, ఐటిసి కో ఆర్డినేటర్ డాక్టర్ వీరరాఘవరావు, ఎండీ ఫరీద్, అహ్మద్, కళ్యాణి, నరసింహారావు పాల్గొన్నారు.
Anantagiri : ‘అనురాగ్’ లో రోబోటిక్స్‌పై వర్క్‌షాప్