ముంబై: ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ ప్లేయర్, యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ మ్యూజిక్ వీడియో రిలీజ్ చేశాడు. ప్రముఖ ఇండియన్ ర్యాపర్ ఎమివే బాంటాయ్‌తో కలిసి అతడు ఈ మ్యూజిక్ వీడియో చేశాడు. తన ర్యాప్ సింగింగ్ టాలెంట్‌ను అతడు బయటపెట్టుకున్నాడు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. జమైకా టు ఇండియా అవుట్ నౌ అని కామెంట్ చేశాడు.
ఈ వీడియోను సంబంధించి ఫస్ట్ లుక్‌ను ఈ నెల 1నే బాంటాయ్ రిలీజ్ చేశాడు. బాంటాయ్‌తో కలిసి మ్యూజిక్ చేయడం చాలా సంతోషంగా ఉందని గేల్ అన్నాడు. గతేడాది నుంచి పంజాబ్ కింగ్స్ టీమ్‌కు ఆడుతున్నాడు గేల్. పంజాబ్ కింగ్స్ సోమవారం రాజస్థాన్ రాయల్స్‌తో తొలి మ్యాచ్ ఆడబోతోంది.