Ban On Paraquat | ‘పారాక్వాట్’ గడ్డి మందును నిషేధిస్తూ అసెంబ్లీలో తీర్మానం..!
Ban On Paraquat : రైతుల పాలిట ప్రాణాంతకంగా మారిన 'పారాక్వాట్' (Paraquat) గడ్డి మందును తెలంగాణ ప్రభుత్వం నిషేధించింది.
Ban On Paraquat : రైతుల పాలిట ప్రాణాంతకంగా మారిన ‘పారాక్వాట్’ (Paraquat) గడ్డి మందును తెలంగాణ ప్రభుత్వం నిషేధించింది. బీఆర్ఎస్ బోయినపల్లి వినోద్ కుమార్, ఇటీవల సినీ నటుడు రాహుల్ రామకృష్ణ పారాక్వాట్ దుష్పరిణామాలపై గళమెత్తిన నేపథ్యంలో.. రైతుల ప్రాణాలు బలిగొంటున్న ఈ గడ్డిమందును నిషేధిస్తూ సోమవారం అసెంబ్లీలో రేవంత్ రెడ్డి సర్కార్ తీర్మానం చేసింది. తద్వారా ఈ హానికర రసాయనం నుండి రాష్ట్రంలోని రైతాంగానికి ఉపశమనం లభించనుంది.
పలు దుష్పరిణామాలతో ప్రాణాంతకంగా మారిన పారాక్వాట్ గడ్డి మందు నిషేధాన్ని రైతులు స్వాగతిస్తున్నారు. ఈ మందును నిషేధించాలని గత రెండు నెలలుగామాజీ ఎంపీ, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు బోయినపల్లి వినోద్ కుమార్ పోరాడారు.
హానికరమైన ఈ గడ్డి మందు వల్ల తలెత్తుతున్న దుష్పరిణామాలు, వందల సంఖ్యలో ప్రజలు, యువతి, యువకులు ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని వినోద్ కుమార్ గళమెత్తారు. పారాక్వాట్ను తక్షణమే నిషేధించాలని ఆయన పలు పత్రికల్లో వ్యాసాలతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు. ఈ గడ్డి మందును నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వినోద్ కుమార్ స్వాగతించారు.
గడ్డి మందును నిషేధిస్తూ అసెంబ్లీలో తీర్మానం
గడ్డి మందును నిషేధించాలని గత రెండు నెలలుగా పోరాడిన మాజీ ఎంపీ, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు బోయినపల్లి వినోద్ కుమార్
గడ్డి మందు వల్ల జరుగుతున్న దుష్పరిణామాలు, వందల సంఖ్యలో ప్రజలు, యువతి, యువకులు ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర ఆందోళన… pic.twitter.com/eZzRwlkWQj
— Telugu Scribe (@TeluguScribe) March 30, 2026
ప్రముఖ నటుడు, సినీ రచయిత రాహుల్ రామకృష్ణ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన సోదరుడు పారాక్వాట్ (Paraquat) అనే అత్యంత ప్రమాదకరమైన గడ్డి నివారణ మందు (Herbicide) కారణంగా మరణించారు. ఈ విషాద వార్తను పంచుకుంటూ సోషల్ మీడియా వేదికగా రాహుల్ రామకృష్ణ చేసిన ట్వీట్ చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.
Honourable Sirs @TelanganaCMO @PMOIndia,
Lost my brother today to Paraquat poisoning. It’s terrifyingly lethal and widely misused for self-destruction. Shocked by how easily it is available everywhere. Doctors are overwhelmed by the amount of cases.Please ban it ASAP-save lives🙏🏽— Rahul Ramakrishna (@eyrahul) March 26, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

