Vaibhav Suryavanshi : భారత క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) ఐపీఎల్లో చెలరేగిపోయాడు. నిరుడు 35 బంతుల్లోనే శతకంతో చరిత్ర సృష్టించిన ఈ చిచ్చరపిడుగు.. వరసగా రెండో సీజన్లోనూ రికార్డు హాఫ్ సెంచరీ బాదేశాడు. తన విధ్వంసక ఆటతో బౌలర్ల పాలిట మాన్స్టర్లా మారిన వైభవ్ పంతొమ్మిదో సీజన్ తొలి మ్యాచ్‌లో 15 బంతుల్లోనే అర్ధ శతకం సాధించాడు. గువాహటిలో చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లను బెంబేలెత్తించిన ఈ లెఫ్ట్ హ్యాండర్ పవర్ ప్లేలో రెండోసారి యాభై రన్స్ కొట్టాడు.
ఐపీఎల్, ఫ్రాంచైజీ క్రికెట్ చరిత్రలో పవర్ ప్లేలోనే అర్ధ శతకం బాదిన ఆటగాళ్లు ఆరుగురే. నిరుడు గుజరాత్ టైటాన్స్‌పై మెరుపు శతకంతో ఆరు ఓవర్లలోపే యాభై కొట్టిన వైభవ్.. ఇప్పుడు చెన్నైపై 15 బంతుల్లోనే ఫిఫ్టీతో రెండోసారి ఈ క్లబ్లో చేరాడు.
Flair on display 🔥
Vaibhav Sooryavanshi in the house 😎
Updates ▶️ https://t.co/UzbuFk5G26#TATAIPL | #KhelBindaas | #RRvCSK pic.twitter.com/dr0hYVaVij
— IndianPremierLeague (@IPL) March 30, 2026
అతడి కంటే ముందు రాజస్థాన్‌కే చెందిన యశస్వీ జైస్వాల్ రెండు పర్యాయాలు ఈ ఫీట్ సాధించాడు. ఈ జాబితాలో జోస్ బట్లర్ (మూడు సార్లు) అగ్రస్థానంలో ఉన్నాడు. మైఖేల్ లాండ్, బెన్ స్టోక్స్, నితీశ్ రానాలు తలా ఒకసారి పవర్ ప్లేలోనే అర్ధ శతకం సాధించారు.