Vaibhav Suryavanshi : ఐపీఎల్ అరంగేట్రంలోనే వేగవంతమైన శతకంతో చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ(Vaibhav Suryavanshi) మరోసారి మెరిశాడు. పంతొమ్మిదో సీజన్ తొలిమ మ్యాచ్‌లోనే తన విధ్వంసాన్ని చూపిస్తూ అర్ధ శతకం సాధించాడు. ఆరంభం నుంచి సిక్స్‌లు, ఫోర్లతో చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లపై విరుచుకుపడిన ఈ లెఫ్ట్ హ్యాండర్ 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ అందుకున్నాడు.
అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో శకంతో భారత్‌ను గెలిపించిన వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ తొలి మ్యాచ్‌లోనూ దంచేశాడు. గువాహటిలో చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లను ఉతికేసిన ఈ 15 ఏళ్ల కుర్రాడు 15 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. నూర్ అహ్మద్ వేసిన ఇన్నింగ్స్ 5వ ఓవర్లో రెచ్చిపోయిన వైభవ్ రెండు సిక్సర్లతో ఫిఫ్టీ అందుకున్నాడు. తద్వారా రాజస్థాన్ తరఫున రెండో వేగవంతమైన, మొత్తంగా మూడో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీతో రికార్డు సృష్టించాడు.
1⃣5⃣-ball FIFTY🔥
That’s the 3⃣rd joint-fastest half-century in #TATAIPL 👏👏
Vaibhav Sooryavanshi goes back for an entertaining 52(17) 👌
Updates ▶️ https://t.co/UzbuFk5G26#KhelBindaas | #RRvCSK pic.twitter.com/NOgpUvNiwL
— IndianPremierLeague (@IPL) March 30, 2026