Headingley Test : హెడింగ్లే టెస్టులో భారత పేసర్ల ధాటికి ఇంగ్లండ్ కుప్పకూలింది. జస్ప్రీత్ బుమ్రా(5-83) విజృంభణతో రెండో సెషన్లోనే ఆతిథ్య జట్టు ఇన్నింగ్స్ ముగిసింది. ఓలీ పోప్(106), హ్యారీ బ్రూక్ (99)రాణించడంతో భారీ స్కోర్ దిశగా పయనించిన ఇంగ్లండ్‌ను ప్రసిధ్ కృష్ణ(3-128) దెబ్బకొట్టాడు. ఆ తర్వాత బుమ్రా తన పేస్ చూపిస్తూ టెయిలెండర్లను పెవిలియన్ చేర్చాడు. దాంతో స్టోక్స్ సేన తొలి ఇన్నింగ్స్‌లో 465 పరుగులకే పరిమితమైంది. భారత్‌కు 6 రన్స్ రూపంలో స్వల్ప ఆధిక్యం లభించింది. టీ బ్రేక్ తర్వాత టీమిండియా రెండో ఇన్నింగ్స్ ఆడనుంది.
భారత్, ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టు రసవత్తరంగా సాగుతోంది. మూడో రోజు భారత పేసర్ల ధాటికి ఇంగ్లండ్ బ్యాటర్లు విలవిలలాడారు. తొలి సెషన్లోనే ఓలీ పోప్(106)ను ఔట్ చేసిన ప్రసిధ్ కృష్ణ ఆతిథ్య జట్టును దెబ్బ తీశాడు. అయితే.. కెప్టెన్ బెన్ స్టోక్స్(20) ఇన్నింగ్స్‌ను నిలబెట్టిన హ్యారీ బ్రూక్(99) జట్టు స్కోర్ 300 దాటించాడు. సిరాజ్ ఓవర్లో గల్లీలో యశస్వీ క్యాచ్ జారవిడవడంతో బతికిపోయిన బ్రూక్.. సిక్స్, ఫోర్‌తో సెంచరీకి చేరువయ్యాడు. కానీ, ప్రసిధ్ తెలివిగా విసిరిన బంతిని నియంత్రణ లేకుండా ఆడి ఔటయ్యాడు. దాంతో.. ఏడో వికెట్ 49 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
𝗙. 𝗜. 𝗙. 𝗘. 𝗥
14th 5⃣-wicket haul in Test cricket! 👏 👏
Outstanding bowling display from Jasprit Bumrah at Headingley! 🔝
He now equals the legendary Kapil Dev for the most fifers – 1⃣2⃣ – for India in Away Tests! 🙌 🙌
Updates ▶️ https://t.co/CuzAEnAMIW#TeamIndia |… pic.twitter.com/AwUKgai6Al
— BCCI (@BCCI) June 22, 2025
ఇంకేముంది మరో రెండు ఓవర్లలో ఇంగ్లండ్ ఆలౌట్ అవుతుందనుకుంటే.. క్రిస్ వోక్స్(38), బ్రైడన్ కార్సే(22)లు బౌండరీలతో చెలరేగారు. 8వ వికెట్‌కు 55 రన్స్ జోడించారు. ఆధిక్యాన్ని తగ్గిస్తున్న ఈ జోడీని సిరాజ్ విడదీయగా.. వోక్స్‌ను బుమ్రా బౌల్డ్ చేశాడు. ఆ కాసేపటికే జోష్ టంగ్(11)ను క్లీన్ బౌల్డ్ చేయగా ఇంగ్లండ్ 465 పరుగులకే ఆలౌటయ్యింది. భారత బౌలర్లలో బుమ్రా ఐదు వికెట్లు పడగొట్టాడు.