Financial Help | యాచారం, జూన్ 22 : యాచారం మండలంలోని అయ్యవారిగూడ గ్రామానికి చెందిన కొప్పు అశోక్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. మిత్రుడు చనిపోయిన విషయం తెలుసుకున్న(2001–2002) పదవ తరగతి బ్యాచ్ కు చెందిన బాల్యమిత్రులు తమ స్నేహితుడు అశోక్ అకాల మరణం చెందడాన్ని తట్టుకోలేకపోయారు.
ఆదివారం తమ చిన్ననాటి స్నేహితుడు అశోక్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తమ వంతు సహాయంగా రూ.1,00,000 అశోక్ కుటుంబ సభ్యులకు అందజేశారు. భవిష్యత్తులో కూడా అశోక్ పిల్లల చదువుల విషయంలో ఎలాంటి సహకారం కోసమైనా అండగా నిలుస్తామని వారు పేర్కొన్నారు. అశోక్ కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని కల్పించారు.
తమ బ్యాచ్లో ఏ ఒక్కరికి ఆపద వచ్చినా సహాయం చేయడంలో ముందుంటామని తెలిపారు. మృతుని కుటుంబానికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, స్నేహితులు, తదితరులు పాల్గొన్నారు.
Peddagattu | జీఓ ఇచ్చారు.. నిధులు మరిచారు.. కాంగ్రెస్ హయాంలో లింగమంతుల స్వామికి శఠగోపమేనా?
Bigg Boss 9 | బిగ్ బాస్ సందడికి టైం ఫిక్స్ అయినట్టేనా.. కంటెస్టెంట్స్ ఎవరెవరంటే..!
Road Accident | వేగంగా వెళ్లి చెట్టును ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి..