Tenth Get together | ఆమనగల్లు,జూన్ 22 : మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2013-2014లో పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల అత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఆదివారం పట్టణంలోని కళ్యాణీ గార్డెన్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అప్పటి గురువులు శశిరెడ్డి, మహాలింగం, కురుమూర్తి, ఉమారాణీ, సుశీల, జాస్మీన్లను పూర్వ విద్యార్థులు పూలమాలలు, శాలువలతో ఘనంగా సన్మానించి పాదాభివందనాలు చేశారు.
అనంతరం నాటి జ్ఞాపకాలను విద్యార్థులతో ఉపాధ్యాయులు పంచుకున్నారు. తదనంతరం విద్యార్థిని, విద్యార్థులు వారు చదువుకున్న రోజుల్లో కొన్ని సంఘటనలను గుర్తు చేసుకుని, యోగా క్షేమాలను అడిగి తెలుసుకుని సాయంత్రం వరకు సంతోషంగా గడిపారు. సమ్మేళనంలో పూర్వ విద్యార్థులు శివ, నర్సింహ్మ, ప్రదీప్, మౌనిక, శ్రీరామ్, మహేందర్, శ్రీహరి తదితరులు ఉన్నారు.