IND vs BAN 1st Test : సొంతగడ్డపై తమకు తిరుగులేదని టీమిండియా(Team India) మరోసారి చాటింది. పర్యాటక బంగ్లాదేశ్‌ను హడలెత్తిస్తూ చెపాక్ టెస్టులో పట్టు బిగించింది. మూడొందల ఆధిక్యంతో బంగ్లాను ఒత్తిడిలోకి నెట్టింది. తొలి రోజు రవిచంద్రన్ అశ్విన్(113), రవీంద్ర జడేజా(86)ల అద్భుత పోరాటంతో కోలుకున్న భారత్.. రెండో రోజు బంగ్లాదేశ్ భరతం పట్టింది. యార్కర్ కింగ్ జస్ప్రీత్ బుమ్రా(4/50) ధాటికి చిగురుటాకలా వణికిన బంగ్లా 149 పరుగులకే కుప్పకూలింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో భారత్ మూడు వికెట్ల నష్టానికి 81 రన్స్ కొట్టింది.
ఓవర్ నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆట కొనసాగించిన భారత్ తొలి సెషన్లోనే ఆలౌటయ్యింది. తస్కిన్ అహ్మద్(3/55) మూడు వికెట్లతో రాణించి బంగ్లాకు బ్రేకిచ్చాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించిన భారత్‌ను తస్కిన్ మరోసారి దెబ్బకొట్టాడు. కెప్టెన్ రోహిత్ శర్మ (5)ను స్వల్ప స్కోర్‌కే ఔట్ చేశాడు.
Stumps on Day 2 in Chennai!#TeamIndia move to 81/3 in the 2nd innings, lead by 308 runs 👌👌
See you tomorrow for Day 3 action 👋
Scorecard – https://t.co/jV4wK7BOKA#INDvBAN | @IDFCFIRSTBank pic.twitter.com/EmHtqyg9W3
— BCCI (@BCCI) September 20, 2024
క్రీజులో కుదురుకున్నట్టే కనిపించిన యశస్వీ జైస్వాల్(10)ను నహిద్ రానా ఆఫ్ సైడ్ బంతితో బోల్తా కొట్టించాడు. ఆ కాసేపటికే విరాట్ కోహ్లీ(17)ను హెహిదీ హసన్ మిరాజ్ ఎల్బీగా వెనక్కి పంపాడు. మూడు వికెట్లు పడిన దశలో శుభ్‌మన్ గిల్ (33 నాటౌట్), రిషభ్ పంత్(12 నాటౌట్)లు ఆచితూచి ఆడారు. రెండో రోజు ఆట ముగిసే సరికి నాలుగో వికెట్‌కు 14 పరుగులు జోడించారు.
చెపాక్ స్టేడియంలో భారత బౌలర్ల ధాటికి బంగ్లాదేశ్(Bangladesh) విలవిలలాడింది. టీమిండియా పేసర్ల విజృంభణకు నిలువలేక ఒకటిన్నర సెషన్లోనే చాప చుట్టేసింది. జస్ప్రీత్ బుమ్రా(4/50), మహ్మద్ సిరాజ్(2/30) బుల్లెట్ బంతులను ఎదుర్కోలేక 149 పరుగులకు ఆలౌటయ్యింది. దాంతో, టీమిండియాకు 227 పరుగుల ఆధిక్యం లభించింది. తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్ సేన 376 పరుగులు కొట్టిన విషయం తెలిసిందే.