పుస్తక సమీక్ష
ఇందులోని కథల్లో కొన్ని పులకింతలు పెడితే, మరికొన్ని ఆలోచింపజేస్తాయి. ఆర్థిక, సామాజిక, రాజకీయ నేపథ్యంలో జరుగుతున్న అనేక పరిణామాలను కథావస్తువులుగా ఎంపిక చేసుకొని పుస్తకంగా ప్రచురించిన ప్రయత్నం బాగుంది.
మానవత్వపు మెచ్చు తునకలు
ఇందులోని కథల్లో కొన్ని పులకింతలు పెడితే, మరికొన్ని ఆలోచింపజేస్తాయి. ఆర్థిక, సామాజిక, రాజకీయ నేపథ్యంలో జరుగుతున్న అనేక పరిణామాలను కథావస్తువులుగా ఎంపిక చేసుకొని పుస్తకంగా ప్రచురించిన ప్రయత్నం బాగుంది. రచయిత తాను గతంలో వివిధ పత్రికలకు రాసి, ప్రచురణ పొందిన 18 కథలను పొందుపరిచారు. వాటిలోని ‘అనూహ్యం’ కథ మనిషి పరివర్తన క్రమాన్ని ఆవిష్కరించింది. వ్యసనాలబారిన పడిన భర్త చేసిన అప్పు తీర్చడం కోసం జానకమ్మ పడే ప్రయాసను ‘రుణానుబంధం’ తెలియజేస్తుంది.
చిన్ననాటి మిత్రుడు పడుతున్న కష్టాలు చూసి చలించిన ప్రకాశం స్నేహితుడి కోసం ఊళ్లోని ఇంటిని, గుడిని బాగుచేయించే కథ ‘ఆపన్నులు’ భాగవంతోని కుచేలోపాఖ్యాన్ని గుర్తు చేస్తుంది. మరో కథలో తన భర్తను వెతికి కాపాడుకోవడంలో రాఘవరావు భార్య సీతమ్మ పడే ఆరాటం పౌరాణిక పాత్ర సతీసావిత్రి పోరాటానికి తక్కువ కాదనిపిస్తుంది. ఇక ‘చిలకలగూడ రైల్వే బిడ్జ్’్ర ఓ క్రైం థ్రిల్లర్ను తలపిస్తుంది. రంగా, శ్రీహర్షలకు దొరికిన డబ్బును పోగొట్టుకున్న వాళ్లకు తిరిగి ఇవ్వడం కోసం వారు చేసే డిటెక్టివ్ పనులు ఆలోచనాత్మకంగా ఉంటాయి. రచయితకు ఇది మొదటి కథా సంపుటే అయినా ఆలోచింపజేసే కథలతో ఈ పుస్తకాన్ని తీసుకొచ్చారు. ఈ కథలు చదివిన ప్రతి ఒక్కరూ మనిషిలోని మానవత్వాన్ని మరింతగా అనుభూతి చెందుతారనిపిస్తుంది.
చిలకలగూడ రైల్వే బ్రిడ్జ్ (కథలు)
రచయిత: కేశిరాజు వెంకట వరదయ్య
పేజీలు: 200, ధర: రూ.200
ప్రతులకు: 98491 18254
-రాజు పిల్లనగోయిన
మహాభారతం (సొగసులు-సూక్ష్మాలు)
రచన : సాకం నాగరాజు
పేజీలు : 91; ధర : రూ.100
ప్రచురణ : అభినవ ప్రచురణలు
ప్రతులకు : అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు
ఫోన్ : 94403 31016
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

