భువనేశ్వర్: ఫిర్యాదు కోసం పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన ఆర్మీ అధికారి, అతడి కాబోయే భార్య పట్ల పోలీసులు అనుచితంగా ప్రవర్తించారు. ఆర్మీ అధికారిని లాకప్‌లో బంధించారు. కాబోయే భార్యను కొట్టడంతోపాటు లైంగికంగా వేధించారు. (Police Abuse Army officer’s fiance) ప్రతిఘటించిన ఆ మహిళను అరెస్ట్ చేయగా కోర్టు బెయిల్ ఇచ్చింది. దీంతో బయటకు వచ్చిన ఆమె పోలీసుల లైంగిక వేధింపుల గురించి మీడియాకు వివరించింది. ఈ నేపథ్యంలో ఐదుగురు పోలీస్ అధికారులను సస్పెండ్ చేశారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో ఈ సంఘటన జరిగింది.
కోల్‌కతాలోని 22వ సిక్కు రెజిమెంట్‌కు చెందిన ఆర్మీ అధికారి కాబోయే భార్యకు భువనేశ్వర్‌లో రెస్టారెంట్ ఉంది. సెప్టెంబర్ 14న అర్ధరాత్రి తర్వాత రెస్టారెంట్ మూసిన ఆమె, ఆర్మీ అధికారితో కలిసి కారులో ఇంటికి వెళ్తున్నది. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వారిని వెంబడించారు. దీంతో వారిద్దరూ భయాందోళన చెందారు. దుండగులపై ఫిర్యాదు చేసేందుకు సమీపంలోని భరత్పూర్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు.
కాగా, సెప్టెంబర్ 15న తెల్లవారుజామున 1.30 గంటల సమయంలో ఆ పోలీస్ స్టేషన్లో మహిళా కానిస్టేబుల్ సివిల్ డ్రెస్‌లో ఉన్నట్లు ఆ మహిళ మీడియాకు తెలిపింది. తన నుంచి ఫిర్యాదు తీసుకునేందుకు ఆమె నిరాకరించినట్లు చెప్పింది. ఇంతలో పోలీస్ అధికారి, మరి కొందరు పోలీసులు స్టేషన్‌కు చేరుకున్నారని, కాబోయే భర్తను సెల్‌లోకి నెట్టి బంధించారని ఆరోపించింది.
అయితే ఆయన ఆర్మీ అధికారి అని, కస్టడీలోకి తీసుకోవడం చట్టవ్యతిరేకమని తాను అన్నట్లు ఆ మహిళ తెలిపింది. దీంతో ఇద్దరు మహిళా పోలీసులు తనపై దాడి చేసినట్లు చెప్పింది. ప్రతిఘటించే క్రమంలో ఒక మహిళా పోలీస్ చేతిని కొరికినట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో తన కోట్ జాకెట్‌తో తనను కట్టేసి గదిలో నిర్బంధించారని తెలిపింది. అనంతరం ఒక పోలీస్ అధికారి గదిలోకి వచ్చి తన ఎదపై కొట్టాడని, ప్యాంటు విప్పిన అతడు ప్రైవేట్ పార్ట్‌ను చూపాడని, తన దుస్తులు కూడా బలవంతంగా తొలగించి లైంగికంగా వేధించినట్లు ఆరోపించింది. తనను అరెస్ట్ చేయడంతో బెయిల్‌పై విడుదలైనట్లు మీడియాకు తెలిపింది. పోలీసుల లైంగిక వేధింపుల గురించి వివరించడంతోపాటు శరీరంపై గాయాలను చూపించి బోరున ఏడ్చింది.
కాగా, మద్యం సేవించిన ఆ జంట విధుల్లో ఉన్న పోలీసులపై దాడి చేయడంతోపాటు స్టేషన్‌లోని కంప్యూటర్, ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారని పోలీసులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆ మహిళను అరెస్ట్ చేయగా సెప్టెంబర్ 18న ఒడిశా హైకోర్టు బెయిల్ మంజూరు చేసిందని చెప్పారు.
మరోవైపు ఈ ఘటన గురించి తెలుసుకున్న ఆర్మీ, ఒడిశా ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ప్రభుత్వం ఈ కేసును సీఐడీకి అప్పగించింది. మహిళపై పోలీసుల దాడి, దుష్ప్రవర్తన తీవ్రతపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో మహిళపై దాడికి పాల్పడిన ఐదుగురు పోలీసు అధికారులను తొలుత బదిలీ చేశారు. ఆ తర్వాత వారిని సస్పెండ్ చేశారు. ఆర్మీ అధికారి ఫిర్యాదుతో ఆ పోలీసులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, జాతీయ మహిళా కమిషన్ కూడా ఈ సంఘటనను సుమోటోగా స్వీకరించింది. మహిళను పోలీసులు లైంగికంగా వేధించడంపై నివేదిక కోరింది. అలాగే ఆ పోలీసులపై అత్యవసరంగా క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. మరోవైపు ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ కూడా ఈ సంఘటనపై స్పందించారు. చాలా హేయమైన చర్య అని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
#OdishaAssaultCase: Army Officer’s Fiancé Reveals Horrific Details Of Assault At Police Station#DNAVideos
For more videos, click here https://t.co/6ddeGFqedQ pic.twitter.com/80Pkg2D8vg
— DNA (@dna) September 20, 2024
The way an Army Major and a lady were treated in Bharatpur Police Station is shocking and beyond comprehension. The manner in which police have allegedly treated them has shaken the conscience of the country. This has happened to a serving Army Officer and a lady within #Odisha.…
— Naveen Patnaik (@Naveen_Odisha) September 20, 2024