Jharkhand Elections : చొరబాటుదార్లు మన నాగరికతను నాశనం చేస్తున్నారని, మన ఆస్తులను ఆక్రమించి, నకిలీ పెండిండ్లతో మన బిడ్డలను మోసం చేస్తున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) ఆరోపించారు. జార్ఖండ్‌లో చొరబాటుదార్లకు చోటు లేకుండా చేయాలంటే అది బీజేపీతోనే సాధ్యమని స్పష్టం చేశారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోంమంత్రి శుక్రవారం గిరిధ్లో ఎన్నికల ప్రచార ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించారు.
ఇక అంతకుముందు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amit Shah).. నక్సల్స్‌కు వార్నింగ్ ఇచ్చారు. ఆయుధాలను వదిలిపెట్టాలని ఆయన కోరారు. హింసను వీడి ఆయుధాలు అప్పగించాలని, నక్సల్స్ సరెండర్ కావాలని ఆయన తెలిపారు. ఒకవేళ నక్సల్స్ లొంగిపోని పక్షంలో.. ఎరివేత ఆపరేషన్ ముమ్మరంగా చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు.
చత్తీస్‌ఘడ్‌లో నక్సల్ హింసతో లింకున్న 55 మంది బాధితులను ఉద్దేశించి ఆయన తన నివాసంలో మాట్లాడారు. 2026 మార్చి 31వ తేదీన మావోయిస్టులు తమ చివరి శ్వాస పీల్చుకుంటారని మంత్రి అమిత్ షా హెచ్చరించారు. ఈ దేశం నుంచి నక్సల్ హింస, ఐడియాలజీని రూపుమాపాలని ప్రధాని మోదీ నిర్ణయించినట్లు మంత్రి షా తెలిపారు.
Read More :
Jani Master | నన్ను ఇరికించిన వాళ్లను వదలిపెట్టను.. జానీమాస్టర్ సంచలన కామెంట్స్