KTR | హైదరాబాద్ : ప్రతిష్ఠాత్మక పారిస్ పారాలింపిక్స్‌లో తొలి రోజైన గురువారం భారత పారా అథ్లెట్లు వేర్వేరు విభాగాల్లో అద్భుత ప్రదర్శన కనబరిచారు. ముఖ్యంగా పారా ఆర్చర్ శీతల్‌దేవి అంచనాలకు మించి రాణించింది. బరిలోకి దిగింది తొలిసారే అయినా ఎక్కడా తడబాటుకు లోనుకాకుండా రాణించింది. మహిళల వ్యక్తిగత కాంపౌండ్ ఓపెన్ ర్యాంకింగ్ రౌండ్లో శీతల్‌దేవి 703 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది.
ఈ నేపథ్యంలో పారా ఆర్చర్ శీతల్ దేవిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. శీతల్ దేవి 703 పాయింట్లతో పారిస్ పారాలింపిక్స్‌లో అద్భుతమైన ప్రదర్శనను ప్రారంభించిందని కొనియాడారు. ఈ ప్రయాణం ఆమె దృఢ సంకల్పానికి, అభిరుచికి నిదర్శనమన్నారు. శీతల్ దేవి కథను చూస్తుంటే.. ఆమెకు, ఆమె కలకు మధ్య ఉన్న అవిశ్రాంతమైన కృషి కనిపిస్తుందన్నారు. రేపు జరగబోయే మ్యాచ్ సందర్భంగా శీతల్ దేవితో పాటు ఆమె టీమ్‌కు కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. నిజమైన చాంపియన్లు ఎప్పుడు కూడా సాకులు చూపరని.. వారు చరిత్ర సృష్టిస్తారు. శీతల్ దేవితో పాటు ఇతర పారా అథ్లెట్లకు సెల్యూట్ చేస్తున్నట్లు కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు.
Archer Sheetal Devi’s incredible journey to the Paris Paralympics, marked by a stunning 703-point performance, is a testament to her rock solid determination and passion
Her story shows that the only thing between her and her dreams is relentless hard work. Wishing her and the…
— KTR (@KTRBRS) August 30, 2024
ఇవి కూడా చదవండి..
Brijbhushan Singh | మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులు.. బ్రిజ్ భూషణ్‌కు కోర్టులో దక్కని ఊరట
Vamsi Modem | ప్రపంచ పవర్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్.. మోడం వంశీకి స్వర్ణం
US Open | యూఎస్ ఓపెన్‌లో జొకో జోరు.. క్రెజికోవాకు షాక్