Brijbhushan Singh | ఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌కు ఢిల్లీ కోర్టులో చుక్కెదురైంది. బ్రిజ్‌భూషణ్ తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ గతేడాది ఆరుగురు మహిళా రెజ్లర్లు ఫిర్యాదు చేయగా ఢిల్లీ పోలీసులు ఆయనపై చార్జిషీట్ దాఖలు చేశారు.
అయితే తనపై ప్రతీకారంతో కొంతమంది కావాలనే ఇలా చేస్తున్నారని, ఈ కేసులో విచారణను నిలిపివేయాలని బ్రిజ్‌భూషణ్ తరఫున న్యాయవాది కోర్టుకు వాదనలు వినిపించారు. విచారణ సందర్భంగా కోర్టు స్పందిస్తూ.. బ్రిజ్‌భూషణ్‌పై కేసును ఎందుకు కొట్టివేయాలనే దానిపై పూర్తి వివరాలను పొందుపరుస్తూ షార్ట్ నోట్ ఇవ్వాలని ఆదేశించింది.