Sunil Gavaskar | భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) నుంచి టీమ్ ఇండియా మహిళా క్రికెట్ స్టార్ జెమీమా రోడ్రిగ్స్ (Jemimah Rodrigues)కు అరుదైన బహుమతి లభించింది. గతంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ అరుదైన బ్యాట్ ఆకారంలో ఉన్న గిటార్ (bat-shaped guitar)ను జెమీమాకు గవాస్కర్ బహుమతిగా ఇచ్చారు. శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఈ ప్రత్యేక బహుమతి ఇచ్చి జెమీమాను ఆశ్చర్యపరిచారు. ఇక ఈ గిటారుతో వీరిద్దరూ పొటోలకు ఫోజులిస్తూ సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
కాగా, గతేడాది జరిగిన మహిళల వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాపై సెమీఫైనల్లో జెమీమా 127 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడి జట్టును ఫైనల్‌కు చేర్చిన విషయం తెలిసిందే. ఆ సమయంలో టీమ్ ఇండియా కనుక కప్పు గెలిస్తే.. జెమీమా గిటార్ వాయిస్తుంటే తాను పాట పాడుతానని గవాస్కర్ వాగ్దానం చేశారు. ఇక ఫైనల్ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించి కప్పు గెలిచింది. దీంతో అప్పుడు ఇచ్చిన హామీని గవాస్కర్ ఇప్పుడు నెరవేర్చుకున్నారు.
Also Read..
PV Sindhu: మలేషియా ఓపెన్ సెమీస్‌లో ఓడిన పీవీ సింధు
ఠక్కర్ సంచలనం.. ప్రపంచ 17వ ర్యాంకర్‌కు ఝలక్
ఐపీఎల్‌తో మీకు పోలికా.. పీఎస్ఎల్లో రెండు కొత్త ఫ్రాంచైజీల విలువ రూ. 110 కోట్లు