దోహా : ప్రపంచ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్స్ (డబ్ల్యూటీటీ)లో భారత యువ ప్యాడ్లర్ మానవ్ ఠక్కర్ సంచలన ప్రదర్శన చేశాడు. ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో మానవ్.. తనకంటే మెరుగైన ర్యాంకు కల్గిన ప్రపంచ 17వ ర్యాంకర్ సిమోన్ గాజీ (ఫ్రెంచ్)పై 3-2 (11-8, 7-11, 9-11, 11-7, 11-8)తో గెలిచి సంచలనం సృష్టించాడు.
35 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన పోరులో తొలి గేమ్‌ను గెలుచుకున్న మానవ్.. తర్వాత రెండు గేమ్స్‌ను ప్రత్యర్థికి కోల్పోయాడు. కానీ నాలుగో గేమ్‌ను గెలుచుకుని ఫలితాన్ని ఐదో రౌండ్‌కు తీసుకెళ్లాడు. కీలకమైన ఐదో గేమ్‌లో ఆరంభంలోనే 5-1 ఆధిక్యాన్ని ప్రదర్శించి ఈ సూరత్ కుర్రాడు.. ప్రత్యర్థికి కోలుకునే అవకాశం కూడా ఇవ్వకుండా ఆటను విజయంతో ముగించాడు.