BNPL | కనిపించని అప్పుతో జాగ్రత్త!.. ఈఎంఐ కొనుగోళ్లతో అప్పుల్లో కూరుకుపోతున్న సామాన్యులు!
BNPL | ఒక వస్తువు కొనాలని ఉంటుంది. అయితే, సమయానికి చేతిలో డబ్బు ఉండదు. పోనీ క్రెడిట్ కార్డు ద్వారా ఇద్దామంటే అదీ ఉండదు. బ్యాంకుల నుంచి లోన్ తీసుకోవాలంటే పెద్ద మొత్తమేమీ కాదు. ఇలాంటి వారి కోసమే గత కొంతకాలంగా ‘బై నౌ పే లేటర్ - ఇప్పుడు కొనండి..తర్వాత చెల్లించండి (బీఎన్‌పీఎల్)’ ఎంపికను పలు యాప్స్, ఫైనాన్స్ సంస్థలు, ఈ కామర్స్ సైట్లతో పాటు కొన్ని బ్యాంకులు కూడా అందుబాటులోకి తెచ్చాయి.
BNPL | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): ఒక వస్తువు కొనాలని ఉంటుంది. అయితే, సమయానికి చేతిలో డబ్బు ఉండదు. పోనీ క్రెడిట్ కార్డు ద్వారా ఇద్దామంటే అదీ ఉండదు. బ్యాంకుల నుంచి లోన్ తీసుకోవాలంటే పెద్ద మొత్తమేమీ కాదు. ఇలాంటి వారి కోసమే గత కొంతకాలంగా ‘బై నౌ పే లేటర్ – ఇప్పుడు కొనండి..తర్వాత చెల్లించండి (బీఎన్‌పీఎల్)’ ఎంపికను పలు యాప్స్, ఫైనాన్స్ సంస్థలు, ఈ కామర్స్ సైట్లతో పాటు కొన్ని బ్యాంకులు కూడా అందుబాటులోకి తెచ్చాయి. అయితే, బీఎన్‌పీఎల్‌తో కనబడని అప్పు అంతకంతకూ పేరుకుపోతుందని, ఆలస్య రుసుములతో సామాన్యులకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతున్నట్టు ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఏమిటీ బీఎన్‌పీఎల్ ?
ఏదైనా వస్తువు కొనుగోలు చేసేప్పుడు ఆ బిల్లును వెంటనే చెల్లించకుండా.. కొన్నాళ్ల తర్వాత ఏక మొత్తంలో లేదా వాయిదాల్లో చెల్లించేందుకు వెసులుబాటును కల్పించేదే బీఎన్‌పీఎల్. దీని ద్వారా కనిష్ఠంగా రూ.100 నుంచి రూ. లక్ష వరకూ సమకూర్చుకోవచ్చు. బిల్లు చెల్లించేందుకు 14 రోజుల నుంచి 90 రోజుల వరకూ గడువు ఉంటుంది.

Emi Payments
ఇవి గుర్తుంచుకోండి..
- బీఎన్‌పీఎల్ సేవలు అందించే కంపెనీలు కస్టమర్‌కు అవసరం ఉన్నా.. లేకపోయినా.. తరచూ కొనుగోలు చేసే విధంగా ఆకర్షిస్తాయి. కాబట్టి వాటి మాయలో పడకుండా అవసరమైన మేర ఉపయోగించుకోవాలి. ఒక వస్తువు కోసం బీఎన్‌పీఎల్ సేవలను వినియోగించామంటే అప్పు చేసినట్టేనని గుర్తు పెట్టుకోవాలి,
- పరిమితి ఉంది కదా అని అవసరం లేకపోయినా ఖరీదైన వస్తువులను కొంటే జేబుకు చిల్లు పడినట్టే. వస్తువు అవసరం, బడ్జెట్, వేతనం, తిరిగి చెల్లించే సామర్థ్యానికి అనుగుణంగా ఈ సేవలను ఉపయోగించుకోవాలి.
- నిర్ణీత గడువు లోగా బిల్లు చెల్లిస్తే బీఎన్‌పీఎల్ సర్వీసులతో ఇబ్బందులు ఉండదు. కానీ పొరపాటున గడువు తేదీలోగా బిల్లు చెల్లించలేకపోతే మాత్రం భారీ పెనాల్టీ, అధిక వడ్డీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. క్రెడిట్ స్కోరు మీద కూడా ప్రభావం పడొచ్చని కొందరు చెబుతున్నారు.
మన దేశంలో ప్రతి 14 మందిలో బీఎన్‌పీఎల్ వినియోగిస్తున్నవారు : 1
సగటున ఒక్కొక్కరు వాడుతున్న బీఎన్‌పీఎల్ ఖాతాలు : 2-4
రూ1500 బీఎన్పీఎల్లో రూ.5 వేలు అప్పుచేసి రెండు నెలలు చెల్లించకపోతే కట్టాల్సిన గరిష్ఠ జరిమానా
మూడు నెలల ఆలస్యం జరిగితే,సగటున కట్టాల్సిన పెనాల్టీ-తీసుకొన్న అప్పుకు 40% అదనం
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

