Bangladesh Team : పాకిస్థాన్‌పై సిరీస్ క్లీన్‌స్వీప్ విజయంతో భారత్‌కు వచ్చిన బంగ్లాదేశ్ (Bangladesh Team) దారుణంగా ఓడింది. చెపాక్ టెస్టులో బ్యాటర్ల వైఫల్యంతో ఘోర ఓటమి చవిచూసింది. దాంతో, సిరీస్ సమం చేయాలంటే కాన్పూర్‌లో నజ్ముల్ హుసేన్ శాంటో సేన గెలవకతప్పని పరిస్థితి. ఈ నేపథ్యంలో పర్యాటక జట్టుకు పెద్ద షాకింగ్ న్యూస్. ఆ జట్టు ప్రధాన స్పిన్నర్ షకీబుల్ హసన్ (Shakib Al Hasan) రెండో టెస్టులో ఆడడంపై అనుమానాలు నెలకొన్నాయి. చెపాక్‌లో గాయపడిన అతడు ఇంకా కోలుకోలేదు. దాంతో, షకీబ్‌కు విశ్రాంతినిచ్చే అవకాశముంది.
చెపాక్ స్టేడియంలో రెండో ఇన్నింగ్స్‌లో షకీబ్ ఎడమ చేతి చూపుడు వేలికి గాయమైంది. దాంతో, అతడు ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేయలేకపోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో 8 ఓవర్లు, రెండో ఇన్నింగ్స్‌లో 13 ఓవర్లు మాత్రమే వేశాడు. గాయం కారణంగా షకీబ్ బ్యాటింగ్‌లోనూ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. రెండో ఇన్నింగ్స్‌లో సిరాజ్ బౌలింగ్‌లో షకీబ్ వేలికి బంతి బలంగా తాకింది. అయినా సరే నొప్పిని భరిస్తూనే బ్యాటింగ్ కొనసాగించాడు.
According to reports! 🚨
Shakib Al Hasan is currently struggling with a finger injury and is doubtful for the second Test against India in Kanpur 👀#INDvsBAN #ShakibAlHasan #TestCricket pic.twitter.com/Mayt2F9YIE
— OneCricket (@OneCricketApp) September 23, 2024
కెప్టెన్ శాంటోతో కలిసి నాలుగో రోజు తొలి సెషన్లో భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నాడు. అయితే.. అశ్విన్ తన తొలి ఓవర్లోనే షకీబ్ పోరాటం ముగించాడు. అక్కడితో బంగ్లాదేశ్ కోలుకోలేకపోయింది. అశ్విన్, జడేజాలు విజృంభించడంతో టీమిండియా 280 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. తద్వారా టెస్టుల్లో 179 విజయాలతో చరిత్ర సృష్టించింది.
🚨 REPORTS 🚨
Bangladesh star all-rounder Shakib Al Hasan has been kept under observation ahead of the second Test after injuring his finger in the first game 🏏🇧🇩#ShakibAlHasan #Bangladesh #Tests #WTC #Sportskeeda pic.twitter.com/RWZAhuQBmT
— Sportskeeda (@Sportskeeda) September 23, 2024
నిరుడు వన్డే వరల్డ్ కప్లోశ్రీలంకతో మ్యాచ్ సమయంలో షకీబ్ ఎడమ చేతి చూపుడు వేలికి గాయమైంది. దాంతో, అతడు కొన్ని రోజులు ఆటకు దూరమయ్యాడు. ఈమధ్యే కోలుకున్న షకీబ్ పాకిస్థాన్ పర్యటనలో ఆడాడు. రెండు టెస్టుల మ్యాచ్‌లో ఈ స్టార్ ఆల్‌రౌండ్ షోతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. తీరా భారత పర్యటనలో మరోసారి గాయపడడంతో షకీబ్ కొన్నాళ్లు జట్టుకు దూరమయ్యే అవకాశముంది.