Gautham Raju | కమెడియన్ల వారసులు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వడం టాలీవుడ్లో కొత్తేమీ కాదు. తాజాగా ఈ జాబితాలో మరో కమెడియన్ కూడా చేరిపోయాడు. ఇంతకీ ఆ యాక్టర్ ఎవరనే కదా మీ డౌటు. సీనియర్ కమెడియన్ గౌతమ్ రాజు (Gautham Raju). ఈ టాలెంటెడ్ కమెడియన్ తనయుడు కృష్ణ హీరోగా నటిస్తోన్న ప్రాజెక్ట్ కిలాడీ కుర్రోళ్లు.
ఈ సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయినట్టు ఇన్సైడ్ టాక్. కృష్ణ త్వరలోనే కిలాడీ కుర్రోళ్లు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు ఫిలింనగర్ సర్కిల్ సమాచారం. కృష్ణారావు సూపర్ మార్కెట్ సినిమాతో కృష్ణ ఇప్పటికే నటుడిగా ఎంట్రీ ఇవ్వగా.. ఈ చిత్రం కోవిడ్ టైంలో ఓటీటీలో విడుదలైంది. మరి కృష్ణ హీరోగా ఎలాంటి ఇంప్రెషన్ కొట్టేస్తాడో చూడాలంటున్నారు సినీ జనాలు.
Priyanka Jawalkar | ట్రిప్‌లో స్టైలిష్‌గా ప్రియాంకా జవాల్కర్.. ఇంతకీ ఎక్కడికెళ్లిందో తెలుసా..?
Chiranjeevi | నా డ్యాన్స్‌లను ఇష్టపడిన ప్రతీ ఒక్కరికి అంకితం : గిన్నీస్ రికార్డ్‌పై చిరంజీవి