Kannappa | టాలీవుడ్ యాక్టర్ మంచు విష్ణు (Manchu Vishnu) తొలిసారి పాన్ ఇండియా మార్కెట్‌పై ఫోకస్ పెట్టాడని తెలిసిందే. ఈ యాక్టర్ టైటిల్ రోల్లో నటిస్తోన్న చిత్రం కన్నప్ప (Kannappa). బాలీవుడ్ దర్శకుడు ముఖేశ్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో గ్లోబల్ స్టార్ ప్రభాస్, మోహన్‌బాబు, మోహన్ లాల్, నయనతార, మధుబాల, శరత్‌కుమార్, శివరాజ్‌కుమార్, ఐశ్వర్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఇప్పటికే మేకర్స్ లాంచ్ చేసిన టీజర్, పోస్టర్లు నెట్టింట చక్కర్లు కొడుతోంది. తిన్నడు, ముండడు, చండుడు పాత్రలకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారని తెలిసిందే. ఇవాళ కన్నప్ప నుంచి మారెమ్మ లుక్‌ను షేర్ చేశారు. ఈ పాత్రలో ప్రముఖ నటి ఐశ్వర్య నటిస్తోంది. అడవిని పీడించే అరాచకం-మారెమ్మ.. కుతంత్రమే తన మంత్రం అంటూ రిలీజ్ చేసిన లుక్ భయపెట్టించేలా ఉంది. కన్నప్పలో మారెమ్మ పాత్ర స్పెషల్‌గా ఉండబోతుందని తాజా లుక్ చెప్పకనే చెబుతోంది. ఇప్పటివరకు వచ్చిన పోస్టర్లతో పోలిస్తే తాజా స్టిల్ సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఈ చిత్రంలో బాలీవుడ్ యాక్టర్ అక్షయ్‌కుమార్ శివుడిగా కనిపించబోతున్నాడు. ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ, స్టీఫెన్ దేవసి మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సమకూరుస్తున్నారు. కన్నప్పను 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, Ava Entertainment బ్యానర్లపై సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పరుచూరి గోపాలకృష్ణ, బుర్రా సాయిమాధవ్, తోట ప్రసాద్ స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు.
Introducing #Aishwarya as #Maremma who is set to unleash wildness in the forests; get ready to experience the force chaos in #Kannappa🏹#HarHarMahadevॐ@themohanbabu @ivishnumanchu @Mohanlal #Prabhas @akshaykumar @realsarathkumar #MukeshRishi @mukeshvachan @MsKajalAggarwal… pic.twitter.com/gpkgux8s6f
— Kannappa The Movie (@kannappamovie) September 23, 2024
Jani Master | జానీమాస్టర్‌ను కస్టడీకి కోరిన నార్సింగి పోలీసులు..!
Chiranjeevi | నా డ్యాన్స్‌లను ఇష్టపడిన ప్రతీ ఒక్కరికి అంకితం : గిన్నీస్ రికార్డ్‌పై చిరంజీవి
Priyanka Jawalkar | ట్రిప్‌లో స్టైలిష్‌గా ప్రియాంకా జవాల్కర్.. ఇంతకీ ఎక్కడికెళ్లిందో తెలుసా..?