T20 World Cup 2024 : తొలిసారి పొట్టి ప్రపంచ కప్ పోటీలకు ఆతిథ్యమిస్తున్న అమెరికా(USA) ఆటలో అదరగొడుతోంది. కానీ, ఆటగాళ్లకు ఏ లోటూ లేకుండా అన్ని సౌలత్లు కల్పించడంలో మాత్రం అమెరికా క్రికెట్ బోర్డు తేలిపోయింది. టీ20 వరల్డ్ కప్ పోటీలకు వైదికైన న్యూయార్క్(Newyork)లో అన్నీ అరకొర వసతులే ఉండడంతో క్రికెటర్లు అన్నిరకాలుగా ఇబ్బంది పడుతున్నారు.
మెగా టోర్నీ మ్యాచ్‌లకు ముందు జిమ్(GYM) చేద్దామన్నా.. అక్కడ హోటల్లో అన్ని పరికరాలు లేవు. దాంతో, టీమిండియా కోసం భారత క్రికెట్ బోర్డు (BCCI) ప్రత్యేకంగా జిమ్ సభ్యత్వం తీసుకుంది. టీమిండియా క్రికెటర్లు తాము బస చేసిన హోటల్‌కు సమీపంలోని ఆ జిమ్‌లో వ్యాయామాలతో బిజీ అయ్యారు. బుధవారం స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ(Virat Kohli), హార్దిక్ పాండ్యా(Hardhik Pandya)లు జిమ్‌లో వర్కవుట్ చేస్తున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి.
Fielding drills ✅
Target 🎯 hitting with match intensity ✅#T20WorldCup | #TeamIndia | #INDvUSA
WATCH 🎥 🔽https://t.co/DlNDWYcgvL
— BCCI (@BCCI) June 12, 2024
రోహిత్ సారథ్యంలోని భారత జట్టు వరల్డ్ కప్‌లో వరుస విజయాలతో దూసుకెళ్తోంది. తొలి పోరులో ఐర్లాండ్ (Ireland)ను చిత్తు చేసిన టీమిండియా.. ఆ తర్వాత చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై 6 పరుగుల తేడాతో సూపర్ విక్టరీ కొట్టింది. సూపర్ 8కు చేరువైన భారత్.. మూడో మ్యాచ్‌లో సంచలనాలకు కేరాఫ్ అయిన అమెరికాతో తలపడనుంది.
One more WIN, and this one… means a little more! 🇮🇳
Let’s keep this going 🔥 @BCCI #T20WorldCup #INDPAK pic.twitter.com/G3aPTsl8O6— Jay Shah (@JayShah) June 9, 2024
ఈ మ్యాచ్‌లో రోహిత్ బృందం గెలిస్తే .. 6 పాయింట్లతో సూపర్ 8కు చేరిన రెండో జట్టు అవుతుంది. ఇప్పటికే గ్రూప్ డిలోని దక్షిణాఫ్రికా సూపర్ 8లో అడుగుపెట్టింది. లో స్కోరింగ్ మ్యాచ్‌లు జరుగుతున్న నస్సౌ కౌంటీ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకు అమెరికా సిద్ధమైంది. రాత్రి 8 గంటలకు మ్యాచ్ షురూ కానుంది.
Building up for the #INDvUSA clash in New York! 👍 👍#T20WorldCup | #TeamIndia pic.twitter.com/JLhqHGRJQn
— BCCI (@BCCI) June 12, 2024