Anil Ravi Pudi | మెగాస్టార్ చిరంజీవి తన 157వ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించేందుకు సిద్ధమయ్యారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ మరియు షైన్ స్క్రీన్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంపై కనీవినీ ఎరుగని రీతిలో బిజినెస్ జరిగినట్లు తెలుస్తుంది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సినిమా సుమారు రూ. 200 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందగా.. ప్రచార ఖర్చులతో కలిపి మొత్తం బిజినెస్ రూ. 225 కోట్ల నుండి రూ. 250 కోట్ల మధ్య జరిగినట్లు తెలుస్తోంది. కేవలం థియేట్రికల్ రైట్స్ ద్వారానే కాకుండా, నాన్-థియేట్రికల్ పరంగా కూడా ఈ సినిమా సంచలనం సృష్టిస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా 105 కోట్ల మేర బిజినెస్ సాధించినట్లు సమాచారం. ఇందులో ఆంధ్రా హక్కులు 55 కోట్లు, నైజాం 32 కోట్లు, సీడెడ్ వాటా 18 కోట్లుగా ఉంది. ఓవర్సీస్ మార్కెట్లోనూ ఈ సినిమా సత్తా చాటుతూ నార్త్ అమెరికా హక్కులు 20 కోట్లకు అమ్ముడయ్యాయి, అక్కడ బ్రేక్ ఈవెన్ సాధించాలంటే కనీసం 5 మిలియన్ డాలర్ల వసూళ్లు రాబట్టాల్సి ఉంటుంది.
మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా 260 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన ఈ సినిమా, క్లీన్ హిట్ అనిపించుకోవాలంటే కనీసం 450 నుంచి 500 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించాల్సి ఉంది. థియేట్రికల్ బిజినెస్‌తో సంబంధం లేకుండా శాటిలైట్ హక్కులు 50 కోట్లకు, అలాగే ఓటీటీ హక్కులు కూడా భారీ ఫ్యాన్సీ ధరకు అమ్ముడవ్వడంతో నిర్మాతలు ఇప్పటికే టేబుల్ ప్రాఫిట్లో ఉన్నట్లు సమాచారం. చిరంజీవి సరసన నయనతార, క్యాథరీన్ త్రెసా నటిస్తుండగా, విక్టరీ వెంకటేష్ ప్రత్యేక పాత్రలో అలరించనున్నారు. సమీర్ రెడ్డి ఛాయాగ్రహణం, భీమ్స్ సిసిరిలియో సంగీతం ఈ చిత్రానికి ప్రధాన బలంగా మారాయి.