Dog | అది నిత్యం వాహన రాకపోకలు సాగే మెయిన్ రోడ్. ఈ రహదారి వెంబడి ఓ కుక్క గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే చనిపోయింది. మెదక్ జిల్లా నర్సాపూర్ మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామ సమీపంలోని ప్రధాన రహదారిపై కుక్క కళేబరం కంపు కొడుతున్నది.
గత మూడు రోజుల క్రితం గుర్తు తెలియని వాహనం ఢీకొని కుక్క చనిపోయినప్పటికీ.. చనిపోయిన కుక్కను అక్కడినుండి తొలగించకపోవడంతో కుళ్లిపోయి దుర్గందాన్ని వెదజల్లుతున్నది. అయితే ఇప్పటికీ గ్రామ పంచాయతీ సిబ్బంది పట్టించుకోకపోవడం వల్ల రోడ్డుపై నుండి వెళ్లే వాహనదారులకు ముక్కు పుటాలు అదిరేలా దుర్గంధం రావడంతో నానా ఇబ్బందులు పడుతున్నారు.
కుక్క కళేబరాన్ని అక్కడినుండి తొలగించకపోవడంతో రోగాలు సోకే అవకాశం ఉందని పలువురు జనాలు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత సిబ్బంది కుక్క కళేబరాన్ని తొలగించి వాహనదారులకు ఉపశమనం కలిగించాలని ప్రజలు కోరుతున్నారు.
Watch: పాముతో వ్యక్తి సంభాషణ.. వీడియో వైరల్
Cigarettes | ‘సిగరెట్ల కోసం వియత్నాం ఫ్లైట్ ఎక్కండి’.. ఓ ఇన్వెస్ట్మెంట్ అడ్వయిజర్ పోస్టు వైరల్
Watch: స్వాతంత్ర్యం సిద్ధించిన 78 ఏళ్ల తర్వాత ఆ గ్రామానికి రోడ్డు.. తొలి బస్సుకు ఘన స్వాగతం