Bhogapuram Airport | విజయనగరం జిల్లా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో తొలి విమానం ల్యాండ్ అయ్యింది. ఆదివారం ఉదయం 10.15 గంటల ప్రాంతంలో వ్యాలిడేషన్ (టెస్ట్) ఫ్లైట్ ఢిల్లీ నుంచి భోగాపురం వచ్చింది. ఈ విమానంలో పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఏటీసీ చైర్మన్ తదితరులు ప్రయాణించారు.
భోగాపురం విమానాశ్రయాన్ని అత్యాధునిక టెక్నాలజీతో నిర్మిస్తున్నారు. ఇప్పటికే 96 శాతం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయినట్లు జీఎంఆర్ సంస్థ వెల్లడించింది. ఇక భోగాపురం ఎయిర్పోర్టును జూన్ 26వ తేదీన ప్రారంభించనున్నారు.
Air India flight AIC3198 successfully landed at ASR International Airport, Bhogapuram 🇮🇳#Visakhapatnam #Vizianagaram #BhogapuramAirport #AndhraPradesh #ASRinternationalairport pic.twitter.com/61Kqu1M7vT
— Andhra Community (@AndhraCommunity) January 4, 2026