Sarvam Maya | మలయాళ స్టార్ నటుడు నివిన్ పాలీ (Nivin Pauly) ఎట్టకేలకు బ్లాక్ బస్టర్‌ను అందుకున్నాడు. అప్పుడెప్పుడో ప్రేమమ్ సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న ఈ నటుడు దాదాపు 10 ఏండ్ల తర్వాత సోలోగా బ్లాక్ బస్టర్‌ను నమోదు చేశాడు. నివిన్ పాలీ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘సర్వం మాయా’ (Sarvam Maya). ఈ సినిమా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. హారర్ కామెడీ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం కేవలం 5 రోజుల్లోనే రూ. 50 కోట్ల క్లబ్లో చేరి సంచలనం సృష్టించింది. అయితే తాజాగా 10 రోజుల్లో రూ.100 కోట్ల క్లబ్లో చేరినట్లు చిత్రబృందం ప్రకటించింది. దీంతో చాలా ఏండ్ల తర్వాత నివిన్ పాలీకి మంచి హిట్ దక్కినట్లు అయ్యింది. అలాగే నివిన్ పాలీకి మొదటి రూ.100 కోట్ల సినిమాగా రికార్డు సాధించాడు. మరోవైపు 2025లో కేరళలో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రాల జాబితాలో మోహన్ లాల్ ‘L2 ఎంపురాన్’, ‘తుడరుమ్’ తర్వాత మూడవ స్థానాన్ని ఈ సినిమా కైవసం చేసుకుంది.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఒక సాదాసీదా యువ పూజారి (నివిన్ పాలీ) జీవితంలోకి ఊహించని విధంగా ఒక ‘ఆత్మ’ ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఆ పూజారి చేసే వింత పనులు, పడే ఇబ్బందులు ఏంటి అనేది ఈ సినిమా కథ. దర్శకుడు అఖిల్ సత్యన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా.. చాలా కాలం తర్వాత నివిన్ పాలీ తన మార్క్ బాడీ లాంగ్వేజ్ మరియు కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను అలరించారు. బాడీ షేమింగ్, వరుస పరాజయాలతో విమర్శలు ఎదుర్కొన్న నివిన్, ఈ సినిమాతో విమర్శకుల నోళ్లు మూయించారు. ఆయనతో పాటు అజు వర్గీస్ కామెడీ టైమింగ్, రియా షిబు నటన సినిమాకు అదనపు బలాన్ని చేకూర్చాయి.
#SarvamMaya has achieved a gross of ₹100 crore worldwide within 10 days, making it the 5th fastest film to reach ₹100 crore in Mollywood.
Happy For @NivinOfficial ❤️🔥 pic.twitter.com/QnxISBguPE
— AB George (@AbGeorge_) January 3, 2026