AP News | ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా ముగిసిపోయిన అంశమని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఏపీకి ప్రత్యేక ప్యాకేజి ఇచ్చిందని తెలిపారు.
ఏపీ ప్రజలకు వైజాగ్ స్టీల్ ఒక సెంటిమెంట్ అని కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ అన్నారు. వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతానని తెలిపారు. ఏపీ ప్రజలకు మేలు జరిగేలా అడుగులు వేస్తానని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా అనేది ముగిసిపోయిన అంశమని అన్నారు. ఏపీకి కేంద్రం ఇప్పటికే ప్రత్యేక ప్యాకేజి ఇచ్చిందని తెలిపారు. విభజన చట్టం హామీలను కూడా అమలు చేసిందని పేర్కొన్నారు. రాబోయే ఐదేళ్లు కూటమితో కలిసి ముందుకెళ్తామని స్పష్టం చేశారు.
.