Kriti Kharbanda | తెలుగులో సక్సెస్ కోసం ప్రయత్నించిన ఉత్తరాది భామల్లో ఒకరు కృతి కర్బందా (Kriti Kharbanda). అక్కినేని సుమంత్‌తో కలిసి బోణీ (Boni).సినిమాతో తొలిసారి సిల్వర్ స్రీన్‌పై మెరిసింది. పవన్ కల్యాణ్ నటించిన తీన్మార్ సినిమాలో వన్ ఆఫ్ ది ఫీ మేల్ లీడ్‌లో మెరిసిన ఈ భామ ఇండస్ట్రీలో తన 15 ఏండ్ల ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఓ భావోద్వేగ సందేశాన్ని అందరితో షేర్ చేసుకుంది. కెరీర్ తొలినాళ్లలో మరిచిపోలేని ఘటనను ఒకటి అభిమానులు, మూవీ లవర్స్‌తో షేర్ చేసుకుంది.
నా టీనేజ్ నుండి మా అమ్మతో కలిసి షాపు నడిపేదాన్ని. షాపింగ్ చేయడం, డిజైన్ చేయడం, దుస్తుల ఎంపిక లాంటి వాటికి మేము చాలా సమయం కేటాయించేవాళ్లం. అయితే నా కన్నడ చిత్రం గూగ్లీ రిలీజైన కొన్ని రోజుల తర్వాత నేను ఎప్పటిలాగే షాపులోకి వచ్చాను. అప్పుడంతా బాగానే ఉంది. కానీ నేను షాపు నుంచి వెళ్లేటప్పుడు వందలాది మంది బయట ఉన్నారని గుర్తించాను. జనాలు చుట్టూ నిలబడి నా వైపు చూస్తూ.. డాక్టర్ అని అరుస్తున్నారు.
నా కళ్లను, చెవులను నేనే నమ్మలేకపోయాను. నేను చాలా పొంగిపోయా. మా నాన్న చేయి పట్టుకుని పార్కింగ్‌కి వెళ్దాం నాన్న.. మనం బయలుదేరాలని చెప్పాను. నా ప్రయాణం టీనేజర్ నుంచి యాక్టర్‌గా, స్టార్‌గా చాలా త్వరగా జరిగిపోయింది. దీంతో నేను రెప్ప వేసేందుకు భయపడ్డా. ఆ తర్వాత నా జీవితం మారిపోయిందంటూ సుదీర్ఘ సందేశాన్ని రాసుకొచ్చింది కృతి కర్బందా. ఈ బ్యూటీ ప్రస్తుతం రెండు హిందీ సినిమాల్లో నటిస్తోంది. వీటిలో ఒకటి షూటింగ్ పూర్తి చేసుకోగా.. మరొకటి చిత్రీకరణ దశలో ఉంది.
కృతి కర్బందా ఇన్‌స్టా పోస్ట్..