IPL 2025 : భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతల ప్రభావం ఐపీఎల్ 18వ సీజన్‌పై పడింది. ఆటగాళ్ల భద్రత దృష్ట్యా గురువారం ధర్మశాలలో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ అర్ధాంతరంగా ఆపేసిన బీసీసీఐ.. మెగా టోర్నీని నిరవధికంగా వాయిదా వేసిన విషయం తెలిసిందే. అయితే.. శుక్రవారం మధ్యాహ్నం మరో ప్రకటనలో వారం రోజుల పాటు ఐపీఎల్ మ్యాచ్‌లకు బ్రేక్ ఇస్తున్నట్టు బీసీసీఐ వివరించింది. అనంతరం పరిస్థితులను బట్టి.. ప్రభుత్వ ఆదేశాలను బట్టి లీగ్ కొనసాగింపుపై నిర్ణయం తీసుకుంటామని ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ వెల్లడించాడు.
ధర్మశాలలో పంజాబ్, ఢిల్లీ మ్యాచ్‌ను రద్దు చేసిన బీసీసీఐ ఆటగాళ్ల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఐపీఎల్‌ను వారం పాటు వాయిదా వేసింది. అప్పటికీ సాధారణ పరిస్థితులు నెలకొనకుంటే ఫ్రాంఛైజీ యజమానులతో మాట్లాడి టోర్నీ నిర్వహణపై ఓ నిర్ణయానికి రానుంది బీసీసీఐ. ప్రస్తుతానికైతే ఐపీఎల్ 18వ సీజన్‌ను వారం రోజులకు వాయిదా వేశాం. బీసీసీఐ, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్, ఐపీఎల్ జట్ల యజమానులతో మాట్లాడాకే ఈ నిర్ణయం తీసుకున్నాం.
🚨 News 🚨
The remainder of ongoing #TATAIPL 2025 suspended with immediate effect for one week.
— IndianPremierLeague (@IPL) May 9, 2025
ఆ తర్వాత మిగతా 16 మ్యాచ్‌ల షెడ్యూల్‌పై త్వరలోనే ప్రకటన వెలువరిస్తాం. ఫ్రాంచైజీ యజమానులు, బ్రాడ్క్టాస్టింగ్, స్పాన్సర్షిప్ సంస్థలతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటాం. మాకు భారత సైన్యంపై పూర్తి విశ్వాసం ఉంది. అయితే.. అందరి భద్రతను దృష్టిలో పెట్టుకొని ఐపీఎల్ మ్యాచ్‌లను వారానికి వాయిదా వేశాం అని బీసీసీఐ అధికారి ఒకరు వివరించారు.
ఐపీఎల్ వాయిదా గురించి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని ఛైర్మన్ అరుణ్ ధుమాల్ చెప్పాడు. ‘ఆపరేషన్ సిందూర్ తర్వాత దేశ సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులను గమనిస్తున్నాం. పరిస్థితులు కాస్త ఉద్రిక్తంగానే ఉన్నాయి. కానీ ఇప్పటివరకూ మాకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. అయితే.. ఆటగాళ్లు, సహాయక సిబ్బందిని తరలించడం కష్టమైన పని. అందుకే.. ఐపీఎల్ ఫ్రాంచైజీలు, మీడియా, బ్రాడ్‌కాస్టింగ్ సంస్థలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకుంటాం’ అని అరుణ్ వెల్లడించాడు.