Basmati Rice: పెరిగిన బాస్మతి బియ్యం ధరలు.. ఇండోపాక్ ఉద్రిక్తతల వల్ల కాదు !
Basmati Rice: బాస్మతి బియ్యానికి అధిక డిమాండ్ ఉందని, దాని వల్లే ఆ రైస్ రేటు పెరిగినట్లు ఆల్ ఇండియా రైస్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సతీశ్ గోయల్ వెల్లడించారు. ఇండోపాక్ ఉద్రిక్తతల వల్ల ఆ బియ్యానికి ధర పెరగలేదన్నారు.
న్యూఢిల్లీ: ఇటీవల బాస్మతి బియ్యం(Basmati Rice) ధరలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఆల్ ఇండియా రైస్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సతీశ్ గోయల్ ఓ ప్రకటన చేశారు. బాస్మతి బియ్యానికి అధిక డిమాండ్ ఉందని, దాని వల్లే ఆ రైస్ రేటు పెరిగినట్లు వెల్లడించారు. ఇండోపాక్ ఉద్రిక్తతల వల్ల ఆ బియ్యానికి ధర పెరగలేదన్నారు. బాస్మతి రైస్‌కి చెందిన 1509, 1718 వెరైటీల ధరలు ఇటీవల మార్చి నెలలో పెరిగాయన్నారు. ఆ బియ్యానికి డిమాండ్ ఎక్కువగా ఉందన్నారు. ఇండోపాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో జరుగుతున్న రవాణా జాప్యం వల్ల బియ్యం ధర పెరగలేదన్నారు. సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్ దేశాల్లో బాస్మతి బియ్యానికి ఎక్కువ డిమాండ్ ఉందని, దాని వల్ల ఆ రేట్లు పెరిగినట్లు చెప్పారు. ఇప్పటి వరకు బాస్మతి బియ్యం వాణిజ్యం ఎటువంటి ప్రభావం పడలేదన్నారు. ఆర్డర్లను చాలా స్మూత్‌గా డీల్ చేస్తున్నట్లు చెప్పారు.
గత ఏడాది సెప్టెంబర్ 1509 బాస్మతి వెరైటీ బియ్యాన్ని కిలో రూ.62 కు అమ్మారని, ఆ తర్వాత వాటి ధరలు తగ్గాయని, పంట దిగుబడి పెరగడంవల్ల ధరలు తగ్గాయని ఏఐఆర్ఈఏ మాజీ అధ్యక్షుడు విజయ్ సేథియా తెలిపారు. ఫిబ్రవరి వరకు ఆ వెరైటీ ధర కిలో 52గా ఉందన్నారు. మార్చి నుంచి మాత్రం బియ్యం ధరలు పెరినట్లు చెప్పారు. ఇండో, పాక్ ఉద్రిక్తతలతో సంబంధం లేదన్నారు. 2024-25 సీజన్లో ఇండియా 60 లక్షల టన్నుల బాస్మతి బియ్యాన్ని ఎగుమతి చేశారని, ఇక పాకిస్థాన్ పది లక్షల టన్నుల బియ్యాన్ని షిప్పింగ్ చేసిందన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింపుల్ లుక్‌తోనే మాయ చేస్తోన్న వైష్ణవి చైతన్య.. ఫొటోలు చూశారా?
Ghee Benefits | నెయ్యితో యవ్వనం సాధ్యమేనా? చర్మ సౌందర్యానికి నెయ్యి ఎలా ఉపయోగపడుతుందో తెలుసా?
CM Bhagwant Mann: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో పంజాబ్ సీఎం నిర్బంధం.. భగవంత్ మాన్కు 50వేల ఫైన్
Rob Jetten | తండ్రి కాబోతున్న తొలి గే ప్రధాని.. 2027లో కలుద్దాం అంటూ భావోద్వేగ పోస్టు!
Asian Para Games: మెన్స్ షాట్‌పుట్‌లో సచిన్‌కు గోల్డ్.. భారత్ పోడియం స్వీప్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

