Nakirekal : ఈ 12న మంగళపల్లిలో జూనియర్ జిల్లా హ్యాండ్ బాల్ సెలక్షన్స్
ఉమ్మడి నల్లగొండ జిల్లా హ్యాండ్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 12న నకిరేకల్ మండలం జడ్పీహెచ్ఎస్ మంగళపల్లి గ్రౌండ్లో జూనియర్ బాల, బాలికల హ్యాండ్ బాల్ జిల్లా జట్టు సెలక్షన్స్ నిర్వహించనున్నట్లు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చింతకాయల పుల్లయ్య శుక్రవారం తెలిపారు.
నకిరేకల్, మే 09 : ఉమ్మడి నల్లగొండ జిల్లా హ్యాండ్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 12న నకిరేకల్ మండలం జడ్పీహెచ్ఎస్ మంగళపల్లి గ్రౌండ్లో జూనియర్ బాల, బాలికల హ్యాండ్ బాల్ జిల్లా జట్టు సెలక్షన్స్ నిర్వహించనున్నట్లు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చింతకాయల పుల్లయ్య శుక్రవారం తెలిపారు.
ఈ సెలక్షన్స్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచి జిల్లా జట్టుకు ఎంపికైన క్రీడాకారులు జూన్ 4 నుండి 6 వరకు నకిరేకల్‌లో జరిగే 47వ తెలంగాణ రాష్ట్ర స్థాయి జూనియర్ బాల, బాలికల హ్యాండ్ బాల్ ఛాంపియన్ షిప్లో పాల్గొననున్నట్లు వెల్లడించారు. ఈ క్రీడల్లో పాల్గొనే బాల, బాలికలు 01-01- 2006 నుండి 31-12-2009 మధ్యలో జన్మించినవారై ఉండాలన్నారు. సెలక్షన్స్ కి వచ్చేప్పుడు తమ ఆధార్ కార్డు, పుట్టిన తేదీ ధ్రువీకరణ వెంట తీసుకురావాలన్నారు. ఈ నెల 30 వరకు శిక్షణ కొనసాగనున్నట్లు పేర్కొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

