కోటపల్లి : మహబూబ్‌నగర్ జిల్లా కోటపల్లి మండలంలో వడదెబ్బతో ( Heatstroke ) ఇద్దరు మృతి చెందారు. మండలకేంద్రానికి చెందిన కర్ణాటకం లక్ష్మి(50) బంధువు ఇటీవల మరణించగా ఆమె అంత్యక్రియలకు వెళ్లి ఇంటికి వచ్చి అస్వస్థతకు గురి అయింది. వైద్యం కోసం కరీంనగర్‌కు( Karimnagar) తరలించగా చికిత్స పొందుతూ మరణించింది.
మండలంలోని సూపాక గ్రామానికి చెందిన నల్లగుంట మల్లయ్య(60) రేషన్ కార్డ్‌లో తన పేరు లేకపోవడంతో దరఖాస్తు చేసుకోవడానికి కోటపల్లి ఎంపీడీవో కార్యాలయం రాగ కూర్చున్న వద్దనే కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో వృద్ధులు , చిన్నారులు ముందు జాగ్రతలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.