Irani Cup 2024 : భారత జట్టు టెస్టు స్క్వాడ్‌లో ఉన్న ముగ్గురు యువ క్రికెటర్లు ఆశాభంగం అయింది. బంగ్లాదేశ్‌తో రెండో టెస్టుకు ఏ మార్పులు చేయకపోవడంతో సర్ఫరాజ్ ఖాన్(Sarfaraz Khan), ధ్రువ్ జురెల్(Dhruv Jurel), యశ్ దయాల్(Yash Dayal) బెంచ్ మీదే ఉండిపోయారు. కాన్పూర్ టెస్టు రేపటితో ముగియనుంది కాబట్టి మేనేజ్మెంట్ ఈ ముగ్గురిని స్క్వాడ్ నుంచి విడుదల చేసింది. ఈ మేరకు బీసీసీఐ ఎక్స్ ఖాతాలో పోస్ట్ కూడా పెట్టింది. దేశం తరపున మరోసారి మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడాలనుకున్న సర్ఫారాజ్, జురెల్‌లు ఇక ఇరానీ కప్(Irani Cup 2024)లో దుమ్మురేపేందుకు సిద్ధమవుతున్నారు.
చెపాక్ టెస్టులో 280 పరుగుల తేడాతో గెలిచిన టీమిండియా కాన్పూర్ టెస్టుకూ అదే జట్టను కొనసాగించింది. నిరుడు అరంగేట్రంలోనే ఇరగదీసిన రంజీ వీరుడు సర్ఫరాజ్ ఖాన్, వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్(Dhruv Jurel)లకు నిరాశే మిగిలింది. కేఎల్ రాహుల్ రాకతో సర్ఫరాజ్‌కు, రిషభ్ పంత్ ఎంట్రీలో జురెల్‌కు తుది జట్టులో చోటు దక్కలేదు. మరోవైపు పేసర్ యశ్ దయాల్ (Yash Dayal)కు తొలి టెస్టు కల కలగానే మిగిలింది. ఇప్పుడు వీళ్లకు ఇరానీ కప్ రూపంలో అవకాశం వచ్చింది.
Update: Sarfaraz Khan, Dhruv Jurel and Yash Dayal have been released from India’s Test squad to participate in the #IraniCup, scheduled to commence tomorrow in Lucknow. pic.twitter.com/E0AsPuIVYX
— BCCI (@BCCI) September 30, 2024
సర్ఫరాజ్ ముంబై తరఫున ఆడనుండగా.. జురెల్, దయాల్‌లు రెస్ట్ ఆఫ్ ఇండియా(ROI)కు ప్రాతినిధ్యం వహించనున్నారు. దేశవాళీలో పాపులర్ అయిన ఈ టోర్నీ అక్టోబర్ 1న మొదలవ్వనుంది. ఈసారి రంజీ చాంపియన్ ముంబై, రెస్ట్ ఆఫ్ ఇండియాలు టైటిల్ కోసం ‘నువ్వానేనా’ అన్నట్టు తలపడనున్నాయి.